Defence Ministry Update: పొరపాటున పాకిస్థాన్‌లో పడిన భారత మిస్సైల్ ! రచ్చ షురూ...
ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత మిస్సైల్ ఒకటి పాకిస్తాన్ భూభాగంలో పడింది.దీంతో ఆ దేశం లేనిపోనివి కల్పించి ఆరోపణలు ప్రారంభించింది. అయితే భారత్ కౌంటర్ ఇచ్చింది.
భారత మిస్సైల్ ఒకటి పాకిస్తాన్ ( Pakistan ) భూభాగంలో పడటం రెండు దేశాల మధ్య కొత్త వివాదానికి కారణం అయింది. ఇండియాకు ( India ) చెందిన ఓ మిస్సైల్ తమ భూభాగంలో పడిందంటూ పాక్ ఆరోపించింది. దీనిపై పాక్ జనరల్ మేనేజర్ బాబర్ ఇప్తికర్ ఆరోపణలు చేశారు. బుధవారం సాయంత్రం హర్యానాలోని సిస్రా వైపు నుంచి ఒక మిస్సైల్ దూసుకొచ్చినట్లు ప్రకటించారు. ఆ సూపర్ సోనిక్ మిస్సైల్ ( Super Sonic Missile ) పాక్ సరిహద్దుల్లో కూలిందని తెలిపారు. దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
చైనా నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ - కోవిడ్ ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో తెలుసా ?
పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. పాక్ లోని చన్ను సమీపంలో ఓ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. అనుమానిత వస్తువు శిథిలాలను బట్టి అది భారత్ కు చెందిన సూపర్ సోనిక్ మిస్సైల్ ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేసింది. ఈ ఘటలో ఎలాంటి నష్టం కలగకపోయినా.. ఓ గోడమాత్రం నాశమైనట్లు తెలిపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్... ఇది ముమ్మాటికీ తమ గగన తలాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లైట్లు తిరిగే ఎత్తులోనే ఈ మిస్సైల్ దూసుకొచ్చిందని.. పైగా జనావాస ప్రాంతాల్లో పడిందని పాకిస్తాన్ ఆరోపించింది.
రష్యాలోని భారత విద్యార్థులకు అలర్ట్ ! ఎంబసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవిగో...
ఈ వివాదంపై విచారణ చేపట్టిన భారత్ .. రొటీన్ ప్రాక్టీస్‌లో భాగంగా విన్యాసాలు చేస్తున్న క్రమంలో పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో మిస్సైల్ పడినట్లుగా గుర్తించారు. ఈ విషయంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. పొరపాటున మిస్సైల్ పాకిస్థాన్ భూభాగంలో పడటం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని తెలిపింది. అయినప్పటికీ ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకుని హైలెవల్ కోర్టు ఎంక్వైరీకి ఆదేశించినట్లుగా రక్షణ శాఖ ప్రకటించింది.
మేమేమైనా తక్కువా! వెస్ట్రన్ ఆంక్షలకు స్పందనగా రష్యా ఆంక్షలు!
2005 లో భారత పాకిస్తాన్ దేశాలు ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని బట్టి ఏ దేశం క్షిపణి పరీక్షలు నిర్వహించినా... మూడు రోజుల ముందే తెలియజేయాలి. ఎవరికీ నష్టం కల్గకుండా నిర్ణీత వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. ఇప్పుడీ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని పాక్ ఆరోపిస్తోంది. అయితే పొరపాటున జరిగిందని భారత్ వివరణ ఇచ్చింది. మరి దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి !