By: Ram Manohar | Updated at : 22 Sep 2023 12:52 PM (IST)
సిక్కుల ఓటు బ్యాంకుని కాపాడుకోడానికే కెనడా భారత్‌పై ఆరోపణలు చేస్తోందా?
India Canada Tensions:
రగులుతున్న చిచ్చు..
భారత్ కెనడా మధ్య రగులుకున్న చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌ప్రీత్ సింగ్ నిజ్జర్ హత్య (Hardeep Singh Nijjar) సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనకాల భారత హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఈ వాదం మొదలైంది. రోజురోజుకీ మాటల యుద్ధం ముదురుతోంది. కెనడా ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తోంది భారత్. అయితే భారత్ కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. రెండు దేశాలూ వాణిజ్యంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇంత కీలకమైన బంధాన్ని కాదనుకుని మరీ జస్టిన్ ట్రూడో సిక్కులకు (Sikhs in Canada) మద్దతునిస్తున్నారంటే అది స్వలాభం కోసమే. అక్కడ సిక్కుల జనాభా ఎక్కువ. అంతే కాదు. ఓ పార్టీ అధికారంలోకి రావాలంటే సిక్కుల మద్దతు లేకుండా అది కుదరదు. సింపుల్‌గా చెప్పాలంటే పొలిటికల్ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేస్తుంది ఆ కమ్యూనిటీ. అంతగా అక్కడ ప్రభావం చూపిస్తోంది. కెనడా జనాభా లెక్కల ప్రకారం.. 2006-16 మధ్య కాలంలో అక్కడ సిక్కుల సంఖ్య భారీగా పెరిగింది. 2021 జనాభా లెక్కల ఆధారంగా చూస్తే (Sikhs Population in Canada) ప్రస్తుతం కెనడాలో 7 లక్షల 70 వేల మంది సిక్కులున్నారు. భారత్‌లో కాకుండా బయట దేశాల్లో ఇంత సిక్కుల జనాభా ఉన్నది ఒక్క కెనడాలోనే. భారత్‌లో సిక్కుల జనాభా 2 కోట్ల 20 లక్షలు. ఇండియా జనాభాలో వీరి సంఖ్య 1.7% కాగా..కెనడాలో మాత్రం ఇది 2.1%గా ఉంది. ఈ లెక్కలే చెబుతున్నాయి అక్కడ సిక్కులు ఎంతగా పాతుకుపోయారో. అందుకే...అక్కడి రాజకీయ పార్టీలు వాళ్లకు అంతగా ప్రియారిటీ ఇస్తాయి.
మైత్రికి సెలవేనా..?
ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఖలిస్థాన్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించకపోయినా అక్కడ జరుగుతున్న అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అదే సంకేతాలిస్తోంది. యాంటీ ఇండియా ఎజెండాతో అక్కడ సిక్కు సంస్థలు పని చేస్తున్నాయని భారత్ ఇప్పటికే రిపోర్ట్ చేసింది. అయినా ట్రూడో పట్టించుకోవడం లేదు. సిక్కుల ఓటు బ్యాంకు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ..దౌత్యపరంగా ఆలోచిస్తే మాత్రం చాలానే నష్టపోయే అవకాశముంది. భారత్, కెనడా మధ్య వాణిజ్య బంధం (India Canda Trade) గట్టిగానే ఉంది. 2022 నాటికి ఈ రెండింటి మధ్య వాణిజ్య విలువ 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కెనడా నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటోంది భారత్. వీటితో పాటు బొగ్గు, ఇటుకలు, ఫర్టిలైజర్స్‌నీ దిగుమతి చేసుకుంటోంది. ఇటు ఇండియా వస్తువులతో పాటు క్లాతింగ్ ఐటమ్స్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కెనడాకు ఎగుమతి చేస్తోంది. కెనడా ఎకానమీలో భారత్ వాటా చాలానే ఉంది. ఐటీ దిగ్గజ సంస్థలు కెనడాలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌లోనూ దాదాపు 600 కెనడా కంపెనీలున్నాయి. భారతీయ విద్యార్థులూ లక్షల సంఖ్యలో కెనడాలో చదువుకోడానికి వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే...రెండు దేశాలకూ ఒకరి అవసరం మరొకరికి ఉంది. ఈ మైత్రిని కాదనుకుని సిక్కులకు మద్దతునిస్తున్నారు ట్రూడో. అక్కడి సిక్కులను సపోర్ట్ చేస్తున్నారంటే...పరోక్షంగా ఖలిస్థాన్ వేర్పాటువాదానికి మద్దతునిస్తున్నట్టేనన్న వాదన వినిపిస్తోంది. తమ సమస్యలను పట్టించుకోకపోవడం భారత్‌కి తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది.
Also Read: Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్‌జాం అంటే అర్థమేంటీ?
ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
JEE Fee: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా
Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>