By: Ram Manohar | Updated at : 22 Sep 2023 01:00 PM (IST)
కెనడా రాజకీయాల్ని సిక్కులు శాసించే స్థాయికి ఎలా ఎదిగారు? (Image Credits: Reuters)
India Canada Tensions:
రాజకీయాలపై ఆధిపత్యం..
కెనడా రాజకీయాలను ఎటు అంటే అటు తిప్పగల కెపాసిటీ సిక్కులకు ఉంది. వాళ్ల ప్రభావం అక్కడి పాలిటిక్స్‌పై (Sikh Politics in Canada) గట్టిగానే కనిపిస్తోంది. అసలు ఆ కమ్యూనిటీ ఓట్లు లేకుండా ఓ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉండవు. అందుకు కారణం...అక్కడి సిక్కులంతా ఒక్కటిగా ఉండడం. ఓ పార్టీకి మద్దతునివ్వాలని డిసైడ్ అయితే...అంతా ఒకేవైపు మొగ్గుతారు. కాదని నిర్ణయించుకున్నా అంతే. పూర్తిగా వ్యతిరేకిస్తారు. అందుకే...ఎన్నికల బరిలోకి దిగిన వాళ్లందరూ సిక్కులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నా ఆ దేశ ప్రధాని సైలెంట్‌గా ఉండడానికి కారణమదే. అంతే కాదు. సిక్కులకు ఉన్న కొన్ని క్వాలిటీస్ అక్కడి పార్టీలకు బాగా కలిసొస్తున్నాయి. కష్టపడి పని చేయడం, ఒక్కటిగా ఉండడం, పెద్ద ఎత్తున నిధులను సేకరించడం లాంటివి ఆ దేశ అభివృద్ధికీ హెల్ప్ అవుతున్నాయి. అందుకే పొలిటికల్ పార్టీలు వాళ్లను బుట్టలో వేసుకుంటాయి. పైగా వీళ్ల నెట్‌వర్క్ చాలా పెద్దది. కెనడాలో భారీ సంఖ్యలో గురుద్వారాలున్నాయి. ఈ సంఖ్యని మరింత పెంచుకుంటూ పోతున్నారు సిక్కులు. రాజకీయాలకు తమ అవసరముందని గ్రహించిన తరవాత వాళ్ల ఆధిపత్యం మరింత పెరిగింది. నిజానికి అక్కడి గురుద్వారాలే రాజకీయాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఆ స్థాయిలో ప్రభావం చూపించగలిగారు సిక్కులు. ఏ పార్టీని సపోర్ట్ చేయాలి..? ఏ పార్టీని సపోర్ట్ చేయకూడదనే నిర్ణయాలన్నింటినీ గురుద్వారాల్లోనే తీసుకుంటారు.
ఆ నియోజకవర్గాల్లో సిక్కులదే పై చేయి..
కెనడా పొలిటికల్ సిస్టమ్ (Canada Politics) చాలా భిన్నంగా ఉంటుంది. ఓ పార్టీ వ్యక్తికి నామినేట్ చేయాలంటే స్థానికంగా వాళ్లకు ఎంత బలముందో చూపించుకోవాలి. మద్దతునిస్తున్నట్టుగా ఓటర్ల నుంచి లెటర్స్ పట్టుకుని రావాలి. ఇందుకోసం ప్రత్యేకంగా నామినేషన్ మీటింగ్స్ నిర్వహిస్తారు. ఎవరైతే పెద్ద ఎత్తున మద్దతు సాధిస్తారో ఆ వ్యక్తే గెలిచినట్టు లెక్క. ఈ విషయంలో సిక్కులు చాలా క్లారిటీగా ఉంటారు. ఎవరి వైపు నిలబడాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. నిజానికి సిక్కుల వ్యవస్థే చాలా బలంగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వంతో సమాంతరంగా మరో ప్రభుత్వంగా పని చేస్తుంది ఈ కమ్యూనిటీ. కమ్యూనిటీ ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే..దాదాపు 8 నియోజకవర్గాల్లో రాజకీయాలను సిక్కులు శాసిస్తున్నారు. అంతే కాదు. కీలకమైన 15 స్థానాల్లోనూ వీళ్ల జనాభా ఎక్కువ. పార్టీల గెలుపోటములను తేల్చేయగల కెపాసిటీ అక్కడి సిక్కులకు ఉంది. చాలా చోట్ల మైనార్టీలుగా ఉన్న సిక్కులే ఎంపీలుగా పోటీ చేసి విజయం సాధించారు. కెనడాలోని House Of Commonsలో మొత్తం 338 మంది (Sikh MP's in Canada) ఎంపీలున్నారు. వీరిలో 18 మంది సిక్కు వర్గానికి చెందిన వాళ్లే. మరో విషయం ఏంటంటే...ఆ దేశంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ తరవాత ఎక్కువ మంది మాట్లాడే భాష పంజాబీ. అంటే...అక్కడి కల్చర్‌లో సిక్కులు అంతగా కలిసిపోయారు. అందుకే...ఏ పొలిటికల్ పార్టీ కూడా సిక్కులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. ముఖ్యంగా ఖలిస్థాన్ వేర్పాటువాదుల గురించి అసలు మాట్లాడదు. మొదటి నుంచి ప్రధాని ట్రూడోకి సిక్కుల మద్దతు ఎక్కువ. ఆయన అధికారంలోకి రావడానికి కారణం కూడా వాళ్లే. ముఖ్యంగా ఖలిస్థాన్ వేర్పాటు వాదులూ ఆయనకు మద్దతునిచ్చారు. ఇప్పుడు వాళ్లపైనే చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తుంటే సైలెంట్ అయిపోయారు.
Also Read: సిక్కుల కళ్లలో ఆనందం కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
CMD Prabhakar Rao Resign: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
Parliament Winter Session: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి, మీ ఆక్రోశాన్ని చూపించకండి - ప్రతిపక్షాలకు ప్రధాని ఉపదేశం
Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే
ముగిసిన సీఎల్పీ భేటీ, కాసేపట్లో సీఎం అభ్యర్థిపై ప్రకటన వచ్చే ఛాన్స్!
DK Shiva Kumar: పార్క్ హయాత్‌లో డీకే శివకుమార్ కీలక భేటీలు, సీఎల్పీకి ముందే ఉత్కంఠ!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు
CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై ఉత్కంఠ, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
/body>