Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla Entry In India: భారత్‌లో టెస్లాని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎలన్ మస్క్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు.
![Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ Elon Musk To Announce 2-3 Billion Dollars Investment Plan For Tesla Entry In India Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/18/956ccd77a47de6e481642447aca77ef71713419938222517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tesla Entry In Indian Market: భారత్‌లో టెస్లా మార్కెట్ కోసం ఎన్నో (Tesla in India) ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు ఎలాన్ మస్క్. అయితే...కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల వల్ల అది కాస్తా ఆలస్యమవుతూ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మస్క్ మామ భారత ప్రభుత్వంతో తరచూ సంప్రదింపులు జరిపారు. ఇండియాలో టెస్లా మార్కెట్‌ని ఏర్పాటు చేసేందుకు కొన్ని కండీషన్స్‌కీ ఓకే అనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ భారత్‌లో 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే వారం ఆయన ఢిల్లీ రానున్నట్టు Reuters వెల్లడించింది. భారత్‌లో భారీ ఫ్యాక్టరీ పెట్టాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. తద్వారా అధికారికంగా ఇండియన్ మార్కెట్‌లోకి అడుగు పెట్టనున్నారు. వచ్చే వారం ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆ సమయంలోనే అధికారికంగా ఆయన ప్లాన్‌ని వెల్లడించే అవకాశముంది. టెస్లా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని ఇండియన్స్‌కి ఎలా పరిచయం చేయనున్నారో వివరించనున్నారు మస్క్. 2023 లెక్కల ప్రకారం భారత్‌లో అమ్ముడైన కార్లలో విద్యుత్ కార్ల వాటా 2% మాత్రమే ఉంది. ఈ వాటాని 2030 నాటికి 30% కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
నిజానికి టెస్లాకి అమెరికా, చైనాలో మంచి మార్కెట్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఈ సేల్స్ పడిపోయాయి. ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే అక్కడ వర్క్‌ఫోర్స్‌నీ తగ్గించింది టెస్లా. అందుకే ఈ సారి పూర్తిగా భారత్‌పైనే ఆధారపడుతోంది. ఈ కొత్త ప్లాన్‌తో ఇప్పటికిప్పుడు కాకపోయినా తరవాత అయినా కొంత వరకూ లాభాలు రావచ్చని భావిస్తోంది. మస్క్ భారత్ విజిట్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా ఆయన వస్తున్న పని మాత్రం టెస్లాని పరిచయం చేసేందుకే. అయితే...ఇటీవల Xలో పెట్టిన పోస్ట్‌ని బట్టి ఆయన త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తారని అర్థమైంది. ఇంపోర్ట్ ట్యాక్స్‌ని తగ్గించాలని టెస్లా అడుగుతున్నప్పటికీ...అందుకు భారత్ ఆసక్తి చూపించడం లేదు. ఎవరికోసమూ రూల్స్‌ని మార్చేయలేమని తేల్చి చెబుతోంది. కానీ తరవాత ఈవీ పాలసీలో ఇటీవలే మార్పులు చేర్పులు చేసింది భారత్. 100% ఉన్న దిగుమతి పన్నుని 15%కి తగ్గించింది. ఇలా టెస్లాకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో అని కీలక నగరాల్లో జల్లెడ పడుతున్నారు మస్క్. ఢిల్లీలో లేదంటే ముంబయిలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. స్పేస్ స్టార్టప్స్ కోసం భారత్ ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ని నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కే మస్క్ హాజరయ్యే అవకాశముంది. అక్కడే టెస్లా ప్లాన్‌ని అమలు చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఈ మీటింగ్ తరవాత ఈ ప్లాన్ ఓ కొలిక్కి రానుందని టెస్లా వర్గాలు చెబుతున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే టెస్లా ఫ్యాక్టరీ ఇండియాలో ఏర్పాటు కానుంది. టెస్లా కార్‌లు భారత్‌లోని రహదారులపై చక్కర్లు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట.
Also Read: ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)