ABP  WhatsApp

Watch Video: మంత్రి గారి శపథం.. కారు ఆపినందుకు ఫైర్.. మళ్లీ అప్పుడే అసెంబ్లీకి వెళతారట!

ABP Desam Updated at: 02 Dec 2021 07:18 PM (IST)
Edited By: Murali Krishna

బిహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. పోలీసు ఆఫీసర్‌పై దురుసుగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

మంత్రి గారి శపథం.. కారు ఆపినందుకు ఫైర్.. మళ్లీ అప్పుడే అసెంబ్లీకి వెళతారట!

NEXT PREV

పోలీసులు తన కారును ఆపినందుకు ఆ మంత్రి ఫైర్ అయ్యారు. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ వాహనాలను పంపేందుకు తన కారును ఆపుతారా అని పోలీసులపై మండిపడ్డారు. బిహార్ మంత్రి జీవేశ్ మిశ్రా పోలీసులపై ఫైర్ అయిన ఈ వీడియో వైరల్ అయింది.







మేమే ప్రభుత్వం.. అలాంటిది ఓ ఎస్పీ, కలెక్టర్ కోసం నన్నే ఆపేస్తారా? ఎస్పీ, కలెక్టర్ కారు కోసం మంత్రి వాహనాన్ని ఆపేయాలని ఎక్కడైనా చట్టం ఉందా? నా వాహనాన్ని ఆపేసిన ఆఫీసర్‌ను సస్పెండ్ చేసే వరకు నేను అసెంబ్లీలో అడుగుపెట్టను.                                                            -  జీవేశ్ మిశ్రా, బిహార్ మంత్రి  


లిక్కర్ బాటిళ్లు..


బిహార్ శాసనసభ ప్రాంగణంలో ఇటీవల ఖాళీ లిక్కర్ బాటిళ్లు దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. టూవీలర్ల కోసం కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో ఓ చెట్టు కింద ఈ సీసాలు కనిపించాయి. ఇటీవల కల్తీ మద్యంతో 40 మందికి పైగా మృతి చెందిన తర్వాత ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఇవి కనిపించడంతో సభలో ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి.


ఖాళీ మద్యం సీసాల విషయంపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఛాంబర్​కు వంద మీటర్ల దూరంలో మద్యం సీసాలు కనిపించడం దారుణమన్నారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్​డీఏ ఎమ్మెల్యేలు మద్యపానానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన 24 గంటల వ్యవధిలోనే సీసాలు కనిపించాయని ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


Also Read: UK Couple: 'రండి బాబు రండి.. రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లు రూ.100కే ఇచ్చేస్తాం'


Also Read: Omicron Variant Cases in India: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


Also Read:  Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్


Also Read:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది


Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది


Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?


Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

Published at: 02 Dec 2021 07:16 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.