Zubeen Garg Death: బాలీవుడ్ స్టార్ సింగర్ ప్రాణాలు తీసిన స్కూబా డైవింగ్ - 52 ఏళ్ల వయసులో రిస్క్ చేశారా?
Zubeen Garg : బాలీవుడ్ స్టార్ సింగర్ జుబెన్ సింగపూర్ టూర్ కు వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ కు ప్రయత్నించి చనిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది.

Assamese Singer Zubeen Garg Dies in Scuba Diving: బాలీవుడ్ సంగీత ప్రపంచం షాక్‌కు గురయింది. ప్రసిద్ధ గాయకుడు, 'యా అలీ' హిట్ సాంగ్‌తో దేశవ్యాప్త ఫేమ్ పొందిన జుబీన్ గార్గ్ స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించారు. సింగపూర్‌లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, గురువారం స్కూబా డైవింగ్ చేస్తుండగా సముద్రంలోకి పడిపోయారు. సింగపూర్ పోలీసులు ఆయన్ను రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా డాక్టర్లు ఆయన్ను కాపాడలేకపోయారు. ఈ ఘటన అస్సాం, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది. బాలీవుడ్ లోనూ చాలా పాటలు పాడారు.
Assam has lost its heartthrob... 💔🎵
— NorthEast United FC (@NEUtdFC) September 19, 2025
We mourn the passing of the legendary singer Zubeen Garg. His music will forever echo in our hearts. Our thoughts and prayers are with his family, friends, and countless admirers in this difficult time...#StrongerAsOne #8States1United pic.twitter.com/ywTp6Fwj4y
సింగపూర్ పోలీసు, మీడియా సోర్సుల ప్రకారం, జుబీన్ గార్గ్ గురువారం మధ్యాహ్నం స్కూబా డైవింగ్ యాక్టివిటీలో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయారు. జుబీన్ సింగపూర్‌లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆహ్వానంతో వెళ్లారు. సెప్టెంబర్ 20న ఆయన పెర్ఫార్మెన్స్ ఉండగా, ఈ ప్రమాదం జరిగింది. ఫెస్టివల్ ఆర్గనైజర్లు ఆయన మరణాన్ని ధృవీకరించి, కార్యక్రమాన్ని ఆపేశారు.
Khelo India singer is no more!
— Kiren Rijiju (@KirenRijiju) September 19, 2025
We have lost a magical voice and a versatile personality. I'm deeply shocked by the tragic demise of Zubeen Garg. His evergreen songs will inspire the talented artists for the generations to come. I pray for his departed soul. #RIN #zebeen 🙏 pic.twitter.com/8SXYbi4hnu
రాక్‌స్టార్ ఆఫ్ నార్త్ ఈస్ట్ గా జుబెన్ గార్గ్ ప్రసిద్ధి చెందారు. 1972లో మెఘాలయలోని బాగ్‌హ్మారాలో జన్మించిన జుబీన్ బోర్థాకుర్ తర్వాత జుబీన్ గార్గ్ గా ప్రసిద్ధి చెందారు. 1990ల్లో అస్సాం మ్యూజిక్‌లో ఎంట్రీ ఇచ్చారు. తన గోత్రం 'గార్గ్'ను స్టేజ్ నేమ్‌గా మార్చేసుకున్నారు. అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాల్లో వేలాది పాటలు పాడారు. 2006లో 'గ్యాంగ్‌స్టర్' సినిమా 'యా అలీ' సాంగ్‌తో బాలీవుడ్‌లో బ్రేక్ దక్కింది. అస్సాం సినిమాల్లో గాయకుడిగా, కంపోజర్‌గా, యాక్టర్‌గా పనిచేసి, 'రాక్‌స్టార్ ఆఫ్ నార్త్ ఈస్ట్' అనే టైటిల్ సంపాదించారు.
হে শিল্পী, তোমালৈ অশ্ৰুসিক্ত শ্ৰদ্ধাঞ্জলি..
— Chief Minister Assam (@CMOfficeAssam) September 19, 2025
অমৰ কণ্ঠ হৈ সকলোৰে হৃদয়ত ৰৈ যাব জুবিন গাৰ্গ।
The immortal voice will remain in everyone's heart, Zubeen Garg. pic.twitter.com/u3YahOomf8
ఆయన మరణం అస్సాం మ్యూజిక్ ఇండస్ట్రీకి భారీ నష్టమని, ఆయన స్వరం శాశ్వతంగా మనసుల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అస్సాం మంత్రి అశోక్ సింగల్ సోషల్ మీడియాలో, "జుబీన్ గార్గ్ మరణం అస్సామ్‌కు నష్టం. ఆయన స్వరం అమరం" అని నివాళి అర్పించారు.





















