అన్వేషించండి

Breaking News Live Telugu Updates: భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకన్న నగరంతో కలిపాం: మోదీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకన్న నగరంతో కలిపాం: మోదీ

Background

కాసేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణలో ఎప్పుడు ఎంటర్ అవుతారు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఎప్పుడు చేరుకుంరా, తిరిగి ఎప్పుడు వెళ్తారు వంటి వివరాల షెడ్యూల్ వచ్చేసింది. 

 

ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.35కు రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరతారు. ఉదయం 11.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. 11.45 నుంచి 11.47 వరకు రైల్వే అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. 11.47 నుంచి 11.55 వరకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఫస్ట్ కోచ్ ను పరిశీలిస్తారు. అదే కోచ్ లో ఉండనున్న చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించనున్నారు. 11.55 నుండి 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. 

అనంతరం 12.15 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 12.18 గంటలకు వేదికపైగా చేరుకుంటారు. అనంతరం కేంద్రమంత్రులు, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ప్రధాని మోదీని సత్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మాట్లాడతారు. అనంతరం 12.37 నుండి 12.41 గంటల మధ్యలో పలు రహదారి ప్రాజెక్టులను వేదికపై నుండే శంకుస్థాపన చేస్తారు. అనంతరం బీబీ నగర్ ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులకు, సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్యలో డబులింగ్ పనులతో పాటు విద్యుత్ పనులకు, సికింద్రాబాద్ - మేడ్చల్ మధ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభిస్తారు. 12.50 నుండి 1.20 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. 1.20 గంటలకు పరేడ్ మైదానం నుండి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయల్దేరతారు. 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి విమానంలో తిరుగు పయనమవుతారు.

రేపు ప్రధాని హైదరాబాద్ కు రాబోతున్న క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా కేంద్ర బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్పీజీ, ఎన్ఎస్జీ, డీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ మొదలైన కేంద్ర బలగాలు పెద్దఎత్తున చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రైల్వే స్టేషన్ వెనుకవైపు నుండి ఎవరిని అనుమతించడం లేదు. ప్రయాణికులను కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వైపు నుండే లోనికి రావాలని సూచిస్తున్నారు. ప్రధాని రాక సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే శనివారం నాడు 10వ ప్లాట్ ఫాం, ట్రాక్ పై నుండి నడపాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కాబట్టి ప్రయాణికులు తాము ప్రయాణించే రైళ్లకు సంబంధించిన సమాచారం తెలుసుకొని స్టేషన్ కు చేరుకోవాలని, అంతే కాకుండా ఇబ్బందులను ముందే గ్రహించి స్టేషన్ కు కనీసం ఒక గంట ముందు చేరుకోవాలని సూచించారు. అలాగే తాము ప్రయాణం చేయాల్సిన రైలులో వీలైనంత త్వరగా ఎక్కి కూర్చోవడం ద్వారా సంతృప్తికరమైన ప్రయాణ అనుభూతిని పొందాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

13:01 PM (IST)  •  08 Apr 2023

భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకన్న నగరంతో కలిపాం: మోదీ

తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమ మోదీ. 11వేల కోట్ల అభివృద్ధిపనులు చేపట్టాం. తెలంగాణ అభివృద్ధి చేసే భాగ్యం కలిగింది. తెలంగాణ పోరాటంలో సామాన్యులు ఎన్నో త్యాగాలు చేశారు. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి నగరాన్ని వందేభారత్‌తో కలిపాం. : 

12:31 PM (IST)  •  08 Apr 2023

ప్రధానమంత్రి మోదీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి: కిషన్ రెడ్డి

ఏ రాష్ట్రాన్నైనా భేదభావం లేకుండా అభివృద్ధి చేస్తాం. 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశాం. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎన్నో రకాల లాభం చేకూర్చాం. అందుకే మోదీని ఆశీర్వదించాలని కోరుతున్నాను- కిషన్ రెడ్డి

12:30 PM (IST)  •  08 Apr 2023

రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు : కిషన్ రెడ్డి 


ప్రతి హిందువు వెంకటేశ్వర స్వామిని దర్శించుకవాలని అనుకుంటాడు. వాళ్ల సౌకర్యార్థం సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య వందేభారత్ ట్రైన్ తెలుగు ప్రజలకు మోదీ అంకితం చేశారు. ఇది 14వ ట్రైన్‌. ఇందులో రెండు తెలుగు ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ 714 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తారు. భవిష్యత్‌లో పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఈ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్- మహబూబ్‌నగర్‌ మధ్య  1410 రూపాయలతో చేపట్టిన డబ్లింగ్‌ లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా బీజేపీ ఎంపీల అభ్యర్థన మేరకు 13 కొత్త ఎంఎంటీఎస్‌ ట్రైన్లు, రెండో దశ పనులను జాతికి అంకితం చేస్తారు.- కిషన్ రెడ్డి

11:49 AM (IST)  •  08 Apr 2023

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, మంత్రి

ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్వాగతం పలికారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం సహా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Lucknow News: పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
పిలవని పెళ్లి భోజనానికి వెళ్లి లక్నో యూనివర్శిటీ విద్యార్థుల రచ్చ- ఎవరి తరపువాళ్లు అని అడిగినందుకు బంధువులపై దాడి
Embed widget