Top 5 Headlines Today: ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ( Alla Resign ) రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేసినా చేయకపోయినా అసలు విషయమే కాదు. ఎందుకంటే మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly Elections ) ఉన్నాయి. కానీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే ఇక్కడ విశేషం. పార్టీకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమిటన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగరి ( Mangalagiri ) నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండో సారి ఆయన లోకేష్‌పై గెలిచారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం.. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు. వీటిలో అతిముఖ్యమైంది రైతు భరోసా పథకం. ఈ పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రైతుభరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రగతిభవన్ (ప్రజాభవన్)లో కాకుండా మరో చోటికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంగణలోకి సీఎం క్యాంపు కార్యాలయం మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్ననే (ఆదివారం) ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీని సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చేందుకు గల సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్, మోక్షజ్ఞ
నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. తుని (Tuni Constituency) నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో సోమవారం యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్ల (Anna Canteens)ను కొనసాగిస్తామని హామీ ఇస్తూ తేటగుంట యనమల అతిధిగృహం వద్ద శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పాల్గొని లోకేష్‌తో కలిసి పాదయాత్రలో చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది