Tripti Dimri About Prabhas Spirit Movie : యానిమల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జోయా పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది. ఆమె అందానికి, నటనకి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. దీంతో తృప్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘యానిమల్’ మూవీలో రణబీర్, తృప్తి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీలో తృప్తి దిమ్రి మరో నేషనల్ క్రష్ గా మారింది. దీంతో ఈ అమ్మడు నటించబోయే తదుపరి సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి జోడిగా తృప్తి దిమ్రి నటిస్తోందని గత కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న 'స్పిరిట్' మూవీలో తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నట్లు నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే విషయంపై త్రిప్తి తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. ఇప్పటికైతే ప్రభాస్ ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ లో తాను లేనని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ‘స్పిరిట్’ మూవీలో తనకు ఎటువంటి అవకాశం రాలేదని చెబుతూ రూమర్స్ కి చెక్ పెట్టింది.


ఎలాగూ స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఈ హాట్ బ్యూటీని సెలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మరో ఇంటర్వ్యూలో యానిమల్ మూవీలో ఇంటిమేట్ సీన్స్ పై తన తల్లిదండ్రులు మొదట్లో అభ్యంతరం చెప్పారని తృప్తి తెలిపింది. కానీ తను ఎలాంటి తప్పు చేయడం లేదని, అది తన పని అని తర్వాత తన పేరెంట్స్ కి వివరించాలని, నటిగా తాను 100% నిజాయితీగా క్యారెక్టర్ చేయాలి కాబట్టి తాను అదే చేశానని, ఇందులో సమస్య ఏం లేదని తన తల్లిదండ్రులతో చెప్పినట్లు పేర్కొంది.


ప్రస్తుతం తృప్తి దిమ్రి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సరసన 'మేరే మెహబూబ్ మేరే సనం' సినిమాలో నటిస్తోంది. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ ‘స్పిరిట్’ విషయానికి వస్తే.. యానిమల్ మూవీని మించిన వైలెన్స్ ఇందులో ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ సందీప్ వంగా స్పష్టం చేశాడు. ప్రభాస్ మొదటిసారి పవర్ఫుల్ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. 2024 జూలై కల్లా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి, సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. 2025లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Also Read : నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి