సినీ పరిశ్రమలో ఏదైనా జంట విడిపోతుందేమో అని చెప్పడానికి ముందుగా వారి సోషల్ మీడియానే సాక్ష్యంగా నిలుస్తుంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకునే ముందు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో అవ్వడం ట్రెండ్‌గా మారింది. తాజాగా మరో బాలీవుడ్ జంట కూడా విడిపోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వారు మరెవరో కాదు.. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్. బాలీవుడ్ సర్కిల్లో గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు. అంతే కాకుండా ట్విటర్‌లో ఆయన షేర్ చేసిన పోస్ట్ కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది.
అంతా అయిపోయింది..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్య రాయ్‌ను అమితాబ్ బచ్చన్ అన్‌ఫాలో చేశారని వార్తలు వచ్చిన తర్వాత ట్విటర్‌లో ఆయన చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘అంతా అయిపోయింది’ అన్నట్టుగా అర్థం వచ్చేలా ఒక కొటేషన్‌ను షేర్ చేశారు బిగ్ బీ. అంతా అయిపోయింది అంటే ఏంటి అర్థం? అసలు అమితాబ్ దేని గురించి మాట్లాడుతున్నారు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే అమితాబ్ ముందు నుంచి ఐశ్వర్యను ఫాలో చేయడం లేదా లేక ఈమధ్యే అన్‌ఫాలో చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొదటినుంచి ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదని మరికొందరు అనుకుంటున్నారు.
పెళ్లి రింగ్ కనిపించడం లేదు..
అమితాబ్ బచ్చన్ ట్వీట్ మాత్రమే కాదు.. అభిషేక్ ప్రవర్తన కూడా విడాకుల వార్తలు నిజమే అనిపించేలా చేస్తోంది. తాజాగా ఒక సమావేశంలో పాల్గొన్న అభిషేక్.. తన పెళ్లి రింగ్‌ను పెట్టుకోలేదు. సాధారణంగా అభిషేక్.. తన పెళ్లి రింగ్‌ను ఎప్పుడూ తీసేయడని, కానీ ఈమధ్య ఆయన చేతికి ఆ రింగ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నా.. బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ఐశ్వర్య కూడా మళ్లీ ఫామ్‌లోకి రావడానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒకట్రెండు చిత్రాల్లో నటించినా.. మళ్లీ యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే చాలాసార్లు..
2007లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన ‘గురూ’ షూటింగ్ సమయంలో ఐశ్వర్యతో ప్రేమలో పడిన అభిషేక్.. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తనకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఆరాధ్య అనే పాప కూడా ఉంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఐశ్వర్య.. ఆరాధ్య పుట్టిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనలో పలు సినిమాల్లో నటించినా.. ఎందుకో మళ్లీ బ్రేక్ తీసుకొని ప్రస్తుతం యాక్టింగ్‌కు దూరం ఉంటోంది. అయితే అభిషేక్, ఐశ్వర్యలు విడిపోతారని వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఎనిమిది సార్లు వీరిద్దరు విడాకులు తీసుకుంటారని బాలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఇది కూడా అలాంటిదే అయ్యిండొచ్చని ఐశ్వర్య ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.
Also Read: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!