Samantha Production House: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనికి ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు.


ఈ సందర్బంగా ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా పిక్చర్స్ లక్ష్యం. అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే ప్లాట్‌ఫాం ఇది.’ అని పోస్టులో పేర్కొన్నారు.


అలాగే ఈ నిర్మాణ సంస్థకు ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని ఎందుకు పేరు పెట్టారో కూడా వివరించారు. తన చిన్నప్పుడు విన్న ఇంగ్లిష్ పాట ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ’లోని ట్రలాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.


నిర్మాణ సంస్థ ప్రారంభించినందుకు సమంతకు ఎంతో మంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, నందినీ రెడ్డి, తేజ సజ్జ, పార్వతి తిరువోత్తు (దూత ఫేమ్), రాహుల్ రవీంద్రన్, రాజ్ అండ్ డీకే... ఇలా ఎంతో మంది సమంత పోస్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. 






సోషల్ మీడియా ప్లాట్ ఫారంల్లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న భారతీయ సినీ సెలబ్రిటీల్లో స్టార్ హీరోయిన్ సమంత ముందంజలో ఉంటారు. సౌత్త తో పాటు నార్త్‌లోనూ భారీ క్రేజ్ సొంతం చేసుకున్న సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 30 మిలియన్లను దాటేసింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడిస్తూ ఆనందాన్ని కూడా వ్యక్తపరిచారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్... ఇలా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకున్న సమంత... నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.


తన ఫోటోలు, వీడియోలను రెగ్యులర్‌గా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. దీనికి తోడు వరుసగా సినిమాలు చేస్తూ వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్స్‌ను దాటేసి అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అప్పుడు ఆస్ట్రియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత ఓ బిల్డింగ్ దగ్గర కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ 30 మిలియన్ అని రాసి 4 హార్ట్ ఎమోజీలని జత చేశారు. ఈ ఫోటోలో సమంత ఆఫ్ వైట్ ప్రింటెడ్ ఓవర్ సైజ్డ్ స్వేట్ షర్ట్, బ్రౌన్ ప్యాంట్, తలకి నీలి రంగు టోపి ధరించి ఎంతో అందంగా కనిపించారు.