Palakurthi Congress MLA Yashaswini Reddy dance: వరంగల్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యశస్విని రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పాలకుర్తిలో పోటీ చేసిన యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విజయం సాధించడం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల తొలిరోజులో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ప్రమాణం చేశారు. నియోజకవర్గానికి వచ్చి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న యశస్విని రెడ్డి స్టెప్పులేశారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.


ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసరిగా పాలకుర్తి మండల కేంద్రానికి విచ్చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు మామిడాల యశస్విని రెడ్డి వెళ్లారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కలిసి మహిళా ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే యాశస్విని రెడ్డి డాన్స్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గెలుపు ర్యాలీలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



 


ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ముద్దాడిన అత్త ఝాన్సిరెడ్డి..
జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది పాలకుర్తి  మండల కేంద్రానికి వచ్చారు యశస్విని రెడ్డి. ఇక్కడి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడినుంచి రాజీవ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బృందావన్ గార్డెన్ లో నిర్వహించిన విజయోత్సవ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  యశస్విని రెడ్డి. అందులో భాగంగానే ఎమ్మెల్యేగా గెలుపొందిన తన కోడలు యశస్విని రెడ్డిని పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి ప్రేమతో ముద్దాడారు.