Animal Movie : రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డివంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. దీంతో రణ్ బీర్ నటనపై ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపించారు. సినిమాలో రణ్ బీర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది తృప్తి దిమ్రి. యానిమల్ మూవీలో జోయా అనే పాత్రలో కాసేపు కనిపించి అందరి హృదయాలు గెలుచుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో తనదైన బోల్డ్ నెస్ తో రచ్చ చేసింది.
దాంతో గత కొద్ది రోజులుగా తృప్తి దిమ్రి పేరు ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఈమెకి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. యానిమల్ సక్సెస్ తో తృప్తి దిమ్రి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఈమె ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ట్ అయిపోయింది. నిజానికి యానిమల్ లో జోయా పాత్రలో నటించే ఛాన్స్ ఈమె కన్నా ముందు మరో బాలీవుడ్ హీరోయిన్ కి వచ్చిందట. ఆమె మరెవరో కాదు సారా అలీ ఖాన్. సందీప్ రెడ్డి వంగ జోయా పాత్ర కోసం ఆడిషన్ నిర్వహించారట. ఈ ఆడిషన్స్ లో సారా అలీ ఖాన్ పార్టిసిపేట్ చేయడంతో మూవీ టీం ఆమెను ఎంపిక చేయగా సారా అలీ ఖాన్ ఆ రోల్ ని రిజెక్ట్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కానీ అసలు విషయం ఏంటంటే ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి యానిమల్ సినిమా కోసం సారా అలీ ఖాన్ ఎలాంటి ఆడిషన్ ఇవ్వలేదని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఓ బాలీవుడ్ మూవీలో తృప్తి దిమ్రిని చూసిన సందీప్ రెడ్డి వంగా ఆమె ఓ యాడ్ షూట్ లో ఉండగా కాల్ చేశారట. అదే రోజు సందీప్ రెడ్డి వంగ తనని పిలిచి యానిమల్ లో కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేశారని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ తర్వాత ఓ ఏడాది వరకు ఆయన నుంచి కాల్ రాకపోవడంతో బాధపడ్డానని ఫైనల్ గా మరోసారి టచ్ లోకి వచ్చి సినిమాలో తనది నెగటివ్ రోల్ అని పాజిటివ్ మ్యానర్ లో కనిపించాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ హీరోయిన్లకు కలిసిరాని 2023!
అలా తనకు యానిమల్ లో ఛాన్స్ వచ్చిందని చెప్పింది. ఇక ఆ తర్వాత రణ్ బీర్ తో ఇంటిమేట్ సీన్స్ చేయడం గురించి మాట్లాడుతూ.." సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేసినప్పుడు రణ్ బీర్, సందీప్.. ఇద్దరు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. రణ్ బీర్ ప్రతి 5 నిమిషాలకు నా దగ్గరికి వచ్చి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు అని అనేవారు. యానిమల్ కోసం నన్ను సంప్రదించినప్పుడే ఇందులో నాకు రణబీర్ కి మధ్య శృంగార సన్నివేశం ఉంటుందని సందీప్ చెప్పారు. నాకు ఏమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమన్నారు. ఆయన చెప్పింది విన్నాక సినిమాలో ఆ సన్నివేశం అవసరం అని అర్థమైంది. అందుకే ఆ సీన్ లో నటించడానికి నేను ఓకే చెప్పా. ఇక షూటింగ్ సమయంలో సందీప్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్లో ఎవరిని అనుమతించలేదు. నటీనటులు కాకుండా సందీప్, సినిమాటోగ్రాఫర్ మాత్రమే షూట్లో పాల్గొన్నారు" అని చెప్పుకొచ్చింది.
Also Read : పుష్ప 2' సెట్స్‌కు గర్ల్ ఫ్రెండ్ వెళ్ళేది ఎప్పుడో తెలుసా?