ఒక్కొక్కసారి సినిమాల్లో నటించే లీడ్ క్యారెక్టర్స్ కంటే సైడ్ క్యారెక్టర్స్‌కే ఎక్కువగా పాపులారిటీ లభిస్తుంది. ప్రతీ పాత్రకు దర్శకుడు సమానంగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక తాజాగా ‘యానిమల్’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఇందులో హీరోయిన్ రష్మికనే అయినా.. సైడ్ క్యారెక్టర్ చేసిన ప్రతీ అమ్మాయికి సమానంగా పాపులారిటీ లభించింది. అందులోనూ ముఖ్యంగా సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి దిమ్రీ అయితే బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ‘యానిమల్’లో రణబీర్ కపూర్‌తో చేసిన ఇంటిమేట్ సీన్స్ పట్ల తన తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో తాజాగా తృప్తి బయటపెట్టింది.
కాస్త సమయం పట్టింది..
‘‘నా తల్లిదండ్రులు అది చూసి కొంచెం ఫీల్ అయ్యారు. మేము సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. కానీ నువ్వు చేశావు. వాళ్లు ఆ సీన్ నుంచి బయటికి రావడానికి కాస్త సమయం పట్టింది. కానీ వాళ్లు మాత్రం నాతో చాలా బాగున్నారు. నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, కానీ పర్వాలేదులే. తల్లిదండ్రులుగా మేము కచ్చితంగా ఫీల్ అవుతాము అని వాళ్లు అన్నారు’’ అంటూ తన పేరెంట్స్ రియాక్షన్‌ను బయటపెట్టింది తృప్తి. బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయని సాహసాన్ని ‘యానిమల్’లో తృప్తి చేసింది. రణబీర్ కపూర్‌తో ఒక సీన్‌లో ఏకంగా న్యూడ్‌గా నటించింది. అంతే కాకుండా రణబీర్‌తో తన కెమిస్ట్రీ వల్ల ఆ ఇంటిమేట్ సీన్‌కు మరింత క్రేజ్ దక్కింది.
అది నా వృత్తి..
తన తల్లిదండ్రుల రియాక్షన్‌కు తన సమాధానం ఏంటో కూడా చెప్పింది తృప్తి. ‘‘నేనేం తప్పు చేయడం లేదని వాళ్లతో అన్నాను. అది నా వృత్తి కాబట్టి నేను సౌకర్యంగా, సేఫ్‌గా ఉన్నంత వరకు అందులో నాకేం సమస్య లేదు. నేను ఒక యాక్టర్ కాబట్టి నేను నా క్యారెక్టర్‌ను 100 శాతం నిజాయితీతో పోషించాలి. నేను అదే చేశాను’’ అని తెలిపింది. ‘యానిమల్’లో ప్రతీ యాక్టర్.. తమ పాత్రకు ఇలా 100 శాతం న్యాయం చేశారు కాబట్టే సినిమా సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యింది. డిసెంబర్ 1న విడుదలయిన ‘యానిమల్’.. ఆ తర్వాత విడుదలయిన సినిమాల పోటీని కూడా తట్టుకొని ఇంకా థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది.
కలెక్షన్స్‌లో రికార్డ్స్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. రష్మిక హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించగా.. బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశారు. చాలాకాలం తర్వాత బాలీవుడ్ వెండితెరపై బాబీ డియోల్‌కు ఈ రేంజ్‌లో హిట్ దక్కింది. ఇక సినిమాకు, తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి బాబీ డియోల్ సైతం పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. స్క్రీన్ టైమ్ కాసేపే అయినా బాబీ డియోల్ భార్యల పాత్రలు చేసిన ఆర్టిస్టులకు కూడా పాపులారిటీ దక్కింది. 3 గంటల 21 నిమిషాల నిడివితో ఇలాంటి ఒక యాక్షన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం టాక్ ఆఫ్ ది టైమ్ అయిపోయింది. ‘యానిమల్’కు వచ్చిన పాజిటివ్ రివ్యూల గురించి ప్రేక్షకుల ఎంతగా మాట్లాడుకుంటున్నారో.. కాంట్రవర్సీల గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. కానీ అవేవి ఈ మూవీ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించడం లేదు.
Also Read: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య