Chitra Shukla Marriage: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది చిత్ర శుక్ల. ఆమె నటించి పలు సినిమాను ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారితో ఏడడుగులు వేసింది. బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్లు వేయించుకుంది. ప్రస్తుతం వీరి వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ తారలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
పోలీసు అధికారిని పెళ్లి చేసుకున్న చిత్ర శుక్ల
నిజానికి గత కొంత కాలంగా వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుంది చిత్ర శుక్ల. తరుచుగా అతడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అంతేకాదు, వైభవ్ ఇంటికి కూడా వెళ్లేది. అతడి కుటుంబ సభ్యులతో కలిసిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలను చూసి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు. పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ రూమర్స్ నిజమేనని రీసెంట్ గా వెల్లడించింది చిత్ర. వైభవ్ తో తన ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మెహందీ, హల్దీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలును కూడా నెట్టింట్లో షేర్ చేసింది. చిత్ర శుక్ల తన భర్త వైభవ్ తో ఉన్న ఫొటోలని పోస్ట్ చేసింది. వైభవ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు.
2014లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిత్ర శుక్ల
ఇక మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్రా శుక్లా 2014లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో హీరోయిన్ వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాతా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'పులి', 'నేను శైలజ' చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి 'రంగుల రాట్నం' సినిమా చేసింది. ఈ సినిమాతో కాస్త క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం ‘సిల్లీ ఫెలోస్’, ‘తెల్లవారితే గురువారం’, ‘పక్కా కమర్షియల్’, ‘ఉనికి’, ‘హంట్’ సినిమాల్లో నటించింది. అయితే, ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య