tycoon junction Janasena :  విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు   జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్   నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.  ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు.  ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందని..  అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని   మనోహర్  ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు.  మనోహర్  ని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలి. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తాను. ప్రజల తరఫున పోరాడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.                           





 


నసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను (Nadendla Manohar) పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. దీనికి మద్దతుగా నోవాటెల్‌ హోటల్‌ వద్ద నాదెండ్ల ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని వైకాపా (YSRCP) ప్రభుత్వానికి సూచించారు. 


‘‘వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుంది. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయం. పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. డివైడర్ తొలిగించే వరకు జనసేన (Janasena) పోరాడుతుందని ప్రకటించారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.