Telugu Breaking News Live: దళిత బంధుకు మరో రూ.500 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అంతేకాక, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విపరీతమైన వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఉప్పల్, బేగంపేట్, అమీర్ పేట్, సికింద్రాబాద్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో దాదాపు 45 నిమిషాల పాటు భారీ వర్షం పడింది. కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, బోయిన్ పల్లి, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డలో భారీగా వర్షం కురిసింది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read: Ahmedabad: కండోమ్ మర్చిపోయి.. ఆ పదార్థంతో లైంగిక చర్య, వెంటనే చనిపోయాడు!
తెలంగాణలో కొత్తగా 357 కోవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 357 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు వెల్లడయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,865కి చేరింది. నిన్న ఒక్క రోజే కోవిడ్ బాధితుల్లో 405 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,46,344కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నకిలీ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు
కృష్ణా జిల్లాలో నకిలీ చలానాల కేసులో ప్రధాన నిందితుడైన స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.కోటి రూపాయల నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లేదన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దళిత బంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల
దళిత బంధు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా ముందుకు వెళ్తోంది. ఆ పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కోసం దళిత బంధును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటాయించిన నిధులతో కలిపి ఇప్పటిదాకా హుజూరాబాద్‌లో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ నిధులను ట్రాన్స్‌ఫర్ చేసింది.
సీఎంను కలిసిన స్టీఫెన్ రవీంద్ర
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన స్టీఫెన్ రవీంద్ర ఇవాళ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ హల్ చల్
ఉస్మానియా ఆస్పత్రిలో ఓ నకిలీ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఇంటర్ బైపీసీ మాత్రమే చదివి డాక్టర్‌గా చెలామణి అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అఫ్జల్‌పై ఉస్మానియా క్యాజువాలిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు అఫ్జల్‌పై 170, 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.