Amritpal Singh News: పెళ్లైన మహిళలతో అమృత్ పాల్ అఫైర్‌లు, అమ్మాయిలతో చాటింగ్ - దర్యాప్తులో సంచలన విషయాలు
Amritpal Singh News: అమృత్ పాల్ సింగ్ పెళ్లైన మహిళలతో అఫైర్ పెట్టుకున్నట్టు దర్యాప్తులో తేలింది.
Amritpal Singh Affairs:
గాలిస్తున్న పంజాబ్ పోలీసులు..
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ ఆచూకీ కోసం 5 రోజులుగా గాలిస్తున్నారు పంజాబ్ పోలీసులు. తనను తాను సిక్కు సన్యాసిగా ప్రచారం చేసుకున్న అమృత్ పాల్ ప్రత్యేక దేశం కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. పంజాబ్‌లో పలు చోట్ల అల్లర్లూ సృష్టించారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్న వెంటనే పరారయ్యాడు. ఇప్పటికే కొంత మంది అనుచరులను అరెస్ట్ చేశారు. అయితే...ఈ కేసు విచారణలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమృత్ పాల్ సింగ్ కొంత మంది అమ్మాయిలతో ఛాట్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. వీరిలో పెళ్లైన మహిళలూ ఉన్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే...వీరిలో కొంత మందిని బ్లాక్‌మెయిల్ కూడా చేశాడు. అమృత్ పాల్ సింగ్ ఛాట్, వాయిస్ నోట్స్‌ను పరిశీలించిన పోలీసులు..ఈ విషయం వెల్లడించారు. కొన్ని వాయిస్ నోట్స్‌లో "నాకు క్యాజువల్ రిలేషన్ అంటేనే ఇష్టం. మరీ అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అమ్మాయిలు ఎందుకింత తొందరగా సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి దిగిపోతారు" అని ప్రశ్నించినట్టుగా ఇండియా టుడే వెల్లడించింది. ఇదే సమయంలో మరో మహిళకు ఓ వాయిస్ నోట్ పంపినట్టు తెలిపింది. అందులో "నాకు సమస్యగా మారనంత వరకూ ఏ మహిళతో అయినా అఫైర్ పెట్టుకోవడానికి రెడీయే" అని అన్నాడు అమృత్ పాల్. ఇంతే కాదు. సోషల్ మీడియాలోనూ మహిళలతో ఛాటింగ్ చేసినట్టు ఆధారాలున్నాయి. "మన రిలేషన్ షిప్ కుదిరిందిగా. హనీమూన్‌కు దుబాయ్ వెళ్దాం" అని మెసేజ్‌లు పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీడియో కాల్స్‌తో కొందరికి ముద్దులు కూడా పెట్టినట్టు తేలింది.
దేశం విడిచిపెట్టి పరారీ..?
ఈ నెల 18వ తేదీన అమృత్‌ను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టారు పంజాబ్ పోలీసులు. వందలాది పోలీస్ కార్లు ఛేజ్ చేస్తున్నా తెలివిగా తప్పించుకుని పారిపోయాడు. దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమృత్‌కు అత్యంత సన్నిహితుడైన పపన్ ప్రీత్ సింగ్‌కు, పాక్‌కు చెందిన ఐసిస్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ దేశాన్ని విడిచి పారిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అమృత్‌పాల్ సింగ్ నేపాల్ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిస్ పంజాబ్ దే నేత కోసం భద్రతా దళాలు పంజాబ్ ను గాలిస్తున్నాయి. చాలా కాలం దుబాయ్ లో ఉన్న అమృత్‌పాల్ కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పరిచయాలు ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి అమృత్‌పాల్ ను వాడుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అమృత్‌పాల్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు దుబాయ్ కు వెళ్లాడు. అక్కడే ఖలిస్థానీ నాయకుడు లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జశ్వంత్ తో, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వారు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత అమృత్‌పాల్‌ను జార్జియా పంపించారు. అక్కడే అతడికి ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్