అన్వేషించండి

Cities Sinking: భూమిలోకి కుంగిపోతున్న నగరాలు, నిర్లక్ష్యం చేస్తే అంతా నేలమట్టం!

China Cities: చైనాలోని ప్రధాన నగరాలు క్రమంగా భూమిలోకి కుంగిపోతున్నాయని ఓ రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది.

Cities Sinking in China: చైనాకి మరో పెద్ద ముప్పు వచ్చి పడింది. ఆ దేశంలోని నగరాలు క్రమంగా (China Cities Sinking) కుంగిపోతున్నాయని ఓ రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్మాణాల సంఖ్య భారీగా పెరగడం వల్ల ఆ బరువుని నేల తట్టుకోలేకపోతోందని స్పష్టం చేసింది. మితిమీరి భూగర్భజలాల్ని తోడుకోవడం వల్ల కూడా నేల కుంగిపోతోందని తెలిపింది. చైనాలోని బీజింగ్, తియాంజిన్ సహా మరి కొన్ని నగరాలు ఈ ప్రమాదంలో ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. పట్టణాల్లోని నేలలో దాదాపు 45% మేర చాలా వేగంగా కుంగిపోతోందని, ఏడాదికి 3 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా కూరుకుపోతోందని వివరించింది. 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నేల తీరుని పరిశీలించిన సైంటిస్ట్‌లు ఈ విషయాలు వెల్లడించారు. 2015-22 మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. మొత్తం 82 నగరాల్లో నేలని పరీక్షించగా కొన్ని సిటీలు మరీ ప్రమాదకర పరిస్థితులున్నాయని తేలింది. కనీసం ఆరు నగరాల్లో ఓ చోట ఏడాదికి 10 మిల్లీమీటర్ల చొప్పున నేల కుంగిపోతోందని గుర్తించారు సైంటిస్ట్‌లు. చైనాలోనే అత్యంత భారీ నగరమైన షాంఘాయ్‌లో గత శతాబ్ద కాలంలో నేల 3 మీటర్ల మేర కుంగిపోయింది. 

అటు బీజింగ్‌లో 45 మిల్లీమీటర్ల చొప్పున భవనాలు క్రమంగా కుంగిపోతున్నాయి. భూగర్భ జలాల్ని మితిమీరి తోడేస్తుండడం, పరిమితి అంటూ లేకుండా భవనాలు నిర్మించడం, రహదారుల విస్తరణ లాంటి కారణాలతో భూమి డొల్లగా మారుతోంది. ప్రస్తుతానికి ఉన్న భవనాల బరువుని మోసేంత సామర్థ్యం కొన్ని నగరాల్లోని భూమిలో తగ్గిపోతోందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. నగరాల్లో ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ విస్తరిస్తుండడమూ సమస్యగా మారింది. ఇష్టారీతిన మైనింగ్ చేయడం, హైడ్రోకార్బన్‌ని పెద్ద ఎత్తున వెలికితీయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. ఇప్పటికిప్పుడు భూగర్భ జలాల వెలికితీతను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్‌లో నగరాలన్నీ కుంగిపోతాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. దీర్ఘకాలిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టకపోతే ముప్పు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఎన్నికలపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలని రామచందర్ రావు ఛాలెంజ్
ఎన్నికలపై నమ్మకం లేకుంటే కాంగ్రెస్ సీఎంలు రాజీనామా చేయాలి: రామచందర్ రావు ఛాలెంజ్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్.. అక్టోబర్ 9 లోగా డిపాజిట్ చెల్లించకపోతే ఇల్లు రద్దు!
Embed widget