Two Girls Married Each Other: స్నేహితురాలితో పెళ్లి కోసం ఏడు సార్లు లింగ మార్పిడి ఆపరేషన్- యూపీలో వింత ఘటన!
Viral News: ప్రేమ కోసం, ప్రేమించిన వారిని దక్కించుకునేందుకోసం ఏమైనా చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో యువతి స్నేహితురాలి కోసం 7సార్లు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని వార్తల్లోకి ఎక్కింది.

Viral News In Uttar Pradesh: ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చెయ్యికపోయినా, మీరు నన్ను బరితెకించాడు అనుకున్నా ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు బ్రహ్మీ ఓ సినిమాలో. ఇప్పుడు అలాంటి సీన్ కాస్త రివర్స్ అయింది అంతే. ఇక్కడ ఇద్దరు యువతులు అదే డైలాగ్ చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం మరో యువతి చేసిన సాహసనం చర్చనీయాంశమైంది. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా ఏడుసార్లు లింగమార్పిడీ చికిత్స చేయింకుందన్నారు.
ప్రేమ(Love)కు సరిహద్దులు లేవు- అనేది నిన్నటి మాట. కానీ, ఇప్పుడు లింగ బేధాలు కూడా(Gender difference) లేవని ప్రపంచ వ్యాప్తంగా అనేక సందర్భాల్లో నిరూపణ అవుతూనే ఉంది. స్వలింగ సంపర్కులు కూడా పెరుగుతున్నారు. దీనికి కారణం.. స్వలింగులే అయినప్పటికీ.. వారి మధ్య చిగురించిన ప్రేమే.. దీనికి కారణం. అయితే..కొన్ని కొన్ని ఘటనల్లో.. స్వలింగ ప్రేమికులు.. లింగ మార్పిడి చేయించుకుని వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్(Uttara Pradesh)లోని కన్నౌజ్ జిల్లాలో జరిగింది. అయితే.. ఈ కేసులో ప్రేమించిన యువతి కోసం.. మరో యువతి ఏడు సార్లు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. దీనికిగాను ఏకంగా ఏడు లక్షల రూపాయలను కూడా ఖర్చు చేసింది. మొత్తానికి అనుకున్నది సాధించారు ఇద్దరూ!
ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్(Kannouge) జిల్లాలో ఉన్న సరయామీరా మండలం.. డెవిన్ తోలా ప్రాంతంలో ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విడదీయలేనంత బంధం పెంచుకున్నారు. అయితే.. కలిసి ఉండేందుకు.. సమాజం ఒప్పుకుంటుందా? అనే సందేహాలు వచ్చాయి. దీంతో ఇరువురూ మూడు ముళ్లు-ఏడు అడుగుల బంధంతో ఒక్కటి కావాలని.. నిర్ణయించుకున్నారు. దీనికి లింగ బేధం అడ్డు వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమికుల్లో ఒకరు లింగ మార్పిడి చేయించుకుని మరీ.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
Also Read: రోడ్డుపై అమ్మాయిల కోట్లాట వీడియో వైరల్, భాయ్ ఫ్రెండ్ కోసమేనంటోన్న నెటిజన్స్
అంగరంగ వైభవంగా..
ఇరు కుటుంబాల పెద్దల(Family)ను యువతులు ఒప్పించి.. సంప్రదాయ బద్ధంగా వివాహం(Marriage) చేసుకోవడం మరింత విశేషం. గురువారం జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇరు కుటుంబాల్లోని పెద్దలు కూడా.. జంటను ఆశీర్వదించారు. భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. కట్నకానుకలు కూడా చదివించడం విశేషం. కాగా. ఆ యువతి పురుషుడిగా మారేందుకు చేయించుకున్న లింగ మార్పిడి ఆపరేషన్లకు ఏకంగా ఏడు లక్షల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం.
ఇదే మొదటిది కాదు!
కాగా ఇలా.. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ఒక్కటైన జంట ఇదే కాదని.. గతంలోనూ యూపీలోని బరేలీ(Barely) ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని స్థానికులు తెలిపారు. బదౌన్‌కు చెందిన యువతి టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో బరేలీకి వచ్చింది. ఆమెకు ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం(Friendship) ఏర్పడి.. అది కాస్తా. ప్రేమగా మారింది. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇద్దరూ స్వలింగులే కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. అయితే.. వారి వ్యతిరేకతను యువతులు పట్టించుకోలేదు. ఒక అమ్మాయి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని.. లీగల్ ఒపీనియన్ తీసుకుని.. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో యంత్రాంగం ముందు ఇరువురు ఒక్కటికావడం విశేషం.
Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !





















