News
News
వీడియోలు ఆటలు
X

ఓ మై గాడ్, ఇయర్ ఫోన్స్‌తో అంత డేంజరా? షేర్ చేసుకున్నా ప్రమాదమేనట!

మీరు మ్యూజిక్ ప్రియులా? అదే పనిగా చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటుంటారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

FOLLOW US: 
Share:

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫోన్లతోనే ఎక్కువ గడుపుతున్నారు. ఫోన్ల స్క్రీన్లు చూస్తూ కళ్లను కష్టపెడుతున్నారు. అంతేకాదు.. చెవులను కూడా పాడు చేసుకుంటున్నారు. అదేలా అనుకుంటున్నారా? నిత్యం ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మొబైల్ ఫోన్లో పాటలు వింటూ.. కబుర్లు చెబుతూ.. కాలక్షేపం చేయడం వల్ల. ఔనండి.. ఇయర్ ఫోన్స్ వల్ల మీకు చాలా ప్రమాదం ఉంది.

ఎక్కువ సమయం పాటు ఇయర్ పోన్లు చెవిలో పెట్టుకుని అదే పనిగా వివే వారి వినికిడికి ప్రమాదం రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆఫీసు జూమ్ మీటింగులు, ఇష్టమైన పాటలు వినడానికి, గేమ్ ఆడేందుకు, బయటి శబ్దాలు వినపడకుండా ఉండేందుకు ఇలా రకరకాల కారణాలతో ఇయర్ ఫోన్లు మన జీవితంలో విడదియరాని భాగంగా మారాయి. ఇలా మనతో మనం గడిపేందుకు ఇవెంత సౌకర్యవంతమో, అతిగా వినియోగిస్తే అంతే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. నిత్యం చెవుల్లో ఇయర్ ఫోన్లు ఇరికించుకుని ఉండే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని, ఇది అంత మంచి సంకేతం కాదని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు?

ఇయర్ ఫోన్ల నుంచి వచ్చే శబ్దం మీ కర్ణభేరికి దగ్గరగా ఉంటుంది. ఈ శబ్దం తీవ్రమైనపుడు కర్ణభేరికి శాశ్వత నష్టం జరగవచ్చు. అంతేకాదు ఇంకా చాలా రకాల అనారోగ్యాలు ఇయర్ ఫోన్ల వాడకం వల్ల కలుగవచ్చని డాక్టర్లు హెచ్చిరిస్తున్నారు.

ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ ధరించడం వల్ల కలిగే నష్టాలు

  • మ్యూజిక్ వింటున్నారా? లేక ఇయర్ ఫోన్ ఉపయోగించి మాట్లాడుతున్నారా అనే దానితో సంబంధం లేదు. ఇయర్ ఫోన్ల వాడకం తగ్గించాలి. ఇయర్ కెనాల్ లో దగ్గరగా వినిపించే శబ్దం ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా తల తిరుగుతున్నాట్లుగా ఉంటుంది.
  • ఇయర్ ఫోన్లు అదే పనిగా చెవిలో ప్లగ్ చేసి ఉంచడం మీకు మీరు చేసుకుంటున్న తీవ్రమైన హానిగా చెప్పుకోవాలి. ఇలా అన్ సేఫ్ గా వినే అలవాటు తాత్కాలికంగా, ఒక్కోసారి శాశ్వతంగా కూడా వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని గ్రహించాలి. హెయిర్ సెల్స్ కారణంగా చెవిలోపలి భాగాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి. ఫలితంగా వినికిడి సమస్యలు రావచ్చు.
  • ఇయర్ ఫోన్ నేరుగా ఇయర్ కెనాల్ లోకి ప్లగ్ చేయబడి గాలిని అడ్డుకుంటుంది. ఇవి చెవి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఇయర్ ఫోన్లు ఎక్కువగా వాడితే  చెవిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. ఇయర్ ఫోన్లు షేర్ చేసుకునే అలవాటు ఉంటే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి ఇయర్ ఫోన్లు షేర్ చేసే అలవాటు మానుకోవడం మంచిది.
  • ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ వాడేవారిలో టిన్నిటస్ ప్రమాదానికి కారణమయ్యే ఇయర్ వాక్స్ చెవిలో పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • సరిగ్గా ఫిక్స్ చెయ్యని లేదా లోపాలున్న ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • ఎప్పుడూ చెవిలో ఏదో ఒకటి మోగుతుండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ (NIHL) పెద్ద శబ్దాల వల్ల మాత్రమే కాదు ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్లు వాడడం వల్ల కూడా రావచ్చు.
  • పెద్ద పెద్ద శబ్దాలు తరచుగా వినడం వల్ల కాక్లియాలోని హెయిర్ సెల్స్ దెబ్బతింటాయి. దీని వల్ల చెవిలో లేదా తలలో రింగుమనే శబ్దం వినిపిస్తుంటుంది. దీనిని టిన్నిటస్ అంటారు. ఇయర్ ఫోన్లు ఎక్కువగా వాడితే ఈ సమస్య రావచ్చు.
  • టిన్నిటస్ తో బాధపడే వారు సాధారణ ధ్వనులకు కూడా అధికంగా స్పందించవచ్చు. దీనిని హైపర్కసిస్ అంటారు.
  • రోజుకు గంటకు మించి ఇయర్ పోన్లు వాడకూడదు అనేవిషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీలైనంత ఇయర్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి చెవి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
Published at : 27 Apr 2023 07:51 PM (IST) Tags: Ear problems ear phones hearing loss Ear Phones Side Effects Ear Phones Health Problems

సంబంధిత కథనాలు

Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్