Skin Care: యంగ్‌గా కనిపించాలా? ఈ సింపుల్ చిట్కాలతో యవ్వనమైన చర్మం మీ సొంతం
యవ్వనమైన చర్మం కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అలా కావాలంటే ఇంట్లో దొరికే వాటితో ఇలా చేస్తే సరిపోతుంది.
చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది. చర్మ సమస్యలు పరిష్కరించడం అంత తెలికేం కాదు. మార్కెట్లో లభించే ఉత్పత్తులు అందరి స్కిన్ కి సరిపోవు. కొన్ని పోషకాల లోపం వల్ల కూడా చర్మం ముడుచుకుపోయినట్టుగా ముడతలు కనిపిస్తాయి. కొంతమంది అయితే వయసు చిన్నగా ఉన్నప్పటికీ మొహం మాత్రం ముడతలు కనిపిస్తే పెద్ద వాళ్ళలాగా కనిపిస్తారు. వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కునేదే. కానీ అది కొంతమందిలో త్వరగా వస్తుంది. బయట దొరికే వాటితో ముడతలు పోగొట్టుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. అందుకే వాటిని కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధాప్య సంకేతాలు తగ్గించేందుకు సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.
కలబంద
కలబంద ఆరోగ్యానికి అన్నీ విధాలుగా పని చేస్తుంది. ఇందులో అనేక విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కలబంద ముఖానికి రాస్తే.. ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కలబంద గుజ్జు ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్యకి కూడా ఇది గొప్ప ఔషధం. కలబందలోని విటమిన్ ఏ, సి, ఇ జుట్టు కుదుళ్ళని బలోపేతం చేసేందుకు సహకరిస్తుంది.
కలబంద చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. సాధారణంగా అలోవెరా 3 దశల్లో పని చేస్తుంది. క్లెన్సింగ్ స్టేజ్, న్యూరిష్‌మెంట్ స్టేజ్, థెరప్యూటిక్ స్టేజ్ గా పని చేస్తుంది. కలబందలోని లిగ్నిన్ చర్మంలోకి చొచ్చుకుపోవడానికి సహాయపడుతుంది. కలబంద మొక్కలోని రెండు రసాయనాలు అలోయిన్, అలోసిన్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
తేనె
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చర్మాన్ని తేమగా ఉంచే మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఇందులో ఉన్నాయి. తేనె ముడతలు తగ్గించేందుకు సహాయపడతాయి. తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు గాయాలను తక్షణమే నయం అయ్యేలాగా పని చేస్తాయి. బి1, బి2, బి3, బి4, బి5, బి6, ఇ, సి, కె, కెరోటిన్ విటమిన్లు ఉంటాయి. తేనెను మొహానికి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. వృద్ధాప్య సంకేతాలను దూరం చెయ్యడంలో సహాయపడుతుంది.
దోసకాయ
దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. చర్మ సంరక్షణకి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చర్మం మీద ముడతలు తగ్గించి మంచి రూపాన్నిఇస్తుంది.
కొబ్బరినూనె
కొబ్బరినూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలు నివారించడంలో గొప్పగా పని చేస్తుంది. నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్ళకి ఇది చాలా మంచిది.
ఇవే కాదు తగినంత నీరు తాగడం అన్నింటికన్నా ముఖ్యం. శరీరానికి తగినంత నీరు అందటం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. శరీరం డీహైడ్రేట్ అవడం వల్ల చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. అందుకే ఎంత నీరు ఎక్కువ తాగితే అంత మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు