By: ABP Desam | Updated at : 02 Feb 2023 04:33 PM (IST)
Edited By: Soundarya
Representational Image/Pexels
ప్రేమని నిరాకరిస్తే యాసిడ్ దాడులు చేయడాలు, నడి రోడ్డు మీద అమ్మాయిని నరకడం వంటి ఘటనలు జరగడం.. నిద్రలేచిన దగ్గర నుంచి చూస్తూనే ఉంటున్నాం. లేదంటే ప్రేమ ఒప్పుకోలేదని మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇది వాటన్నింటికంటే భిన్నం. ఎక్కడైనా పరుష పదజాలంతో దూషించడం, అవమానించడం వంటివి చేస్తే పరువు నష్టం దావా వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒకతను స్నేహితురాలు ప్రేమించలేదని కేసు వేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
తన ప్రేమ కాదని అన్నందుకు సింగపూర్ కి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితురాలి మీద కేసు వేశాడు. తను ప్రేమించకపోవడం వల్ల మానసికంగా తీవ్రంగా గాయపడ్డాను, వ్యాపారపరంగా కూడా నష్టపోయానంటూ అతను ఆమె మీద పరువు నష్టం దావా వేశాడు. పరిహారంగా ఏకంగా 3 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.24 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అసలేం జరిగిందంటే..
సింగపూర్ కి చెందిన కౌషిగన్ కి 2016 లో నోరా టాన్ అనే మహిళ పరిచయం అయ్యింది. 2020 వరకు ఇద్దరూ స్నేహితుల్లాగా మంచిగానే ఉన్నారు. కానీ ఒకరోజు కౌషిగన్ టాన్ తో రొమాంటిక్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలని అనుకుంటునట్టు చెప్పాడు. కానీ టాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలేదని, తనని ఆ ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదని కేవలం బెస్ట్ ఫ్రెండ్ గా మాత్రమే చూస్తున్నా అని చెప్పింది. దీంతో అతనికి కోపం వచ్చి టాన్ ని బెదిరించడం మొదలు పెట్టాడు. కేసు వేస్తానంటూ వరుసగా బెదిరింపు మెసేజ్ లు చేశాడు. దీంతో టాన్ తనతో ఒక ఒప్పందానికి వచ్చింది. తమ మధ్య వచ్చిన సమస్య పరిష్కరించుకోవడం కోసం ఇద్దరూ కలిసి కౌన్సిలింగ్ కి వెళ్లాలని అనుకున్నారు. ఏడాది పాటు కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. కానీ కౌషిగన్ మాత్రం తన మనసు మార్చుకోలేదు.
ఎన్ని కౌన్సిలింగ్ లకి వెళ్ళినా కూడా టాన్ మీద తన ఫీలింగ్స్ మారలేదని చెప్పాడు. ఇలా అయితే బంధం కొనసాగించడం అనవసరమని టాన్ తనని దూరం పెట్టసాగింది. కోపం తెచ్చుకున్న కౌషిగన్ ఆమె మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. కోర్టులో కేసు వేశాడు. తన ప్రవర్తన వల్ల మానసికంగా కుంగిపోయాను, తను చేసిన గాయం వల్ల బాధ అనుభవించాను. తన ఫీలింగ్స్ అంగీకరించకపోవడం వల్ల వ్యాపారపరంగా కూడా దెబ్బతిన్నా, పరువుకి భంగం వాటిల్లింది అంటూ కోర్టులో కేసు ఫైల్ చేయించాడు. తనకి జరిగిన నష్టానికి గాను 3 మిలియన్ల డాలర్లు పరిహారం ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఈ పిటిషన్ విచారణ ఫిబ్రవరి 9వ తేదీన జరగనుంది. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అమ్మాయికి మనోభావాలు గౌరవించాలని కౌషిగన్ కి కోర్టు మొట్టికాయ వేస్తుందో, లేదంటే టాన్ ని తిడుతుందో చూడాలి. అయితే, వార్త చదివిన అబ్బాయిలు తెగ సంబరపడిపోతున్నారు. అతడికి న్యాయం జరగాలని, ప్రేమ పేరుతో వెనుక తిప్పించుకుని మోసం చేసే అమ్మాయిలకు అది కనువిప్పి కావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇష్టంలేని ప్రేమను ఆమె ఎలా అంగీకరిస్తుంది? ప్రేమను తిరస్కరించే స్వేచ్ఛ ఆమెకు లేదా అంటున్నారు. మరి కోర్టు ఏం చెబుతుందో చూద్దాం.
Also Read: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవాలంటే రోజూ ఆ పదార్ధం తినాల్సిందే
Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం
World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
నాకూ, నా భర్తకు మధ్యలో మా అత్తగారు - ఆవిడ ప్రవర్తన నాకు నచ్చడం లేదు
Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?