అన్వేషించండి

Lipstick Plant: వందేళ్ల తరువాత మళ్లీ కనిపించిన ‘లిప్‌స్టిక్’ మొక్కలు, ఎక్కడో తెలుసా?

అరుదైన మొక్కల జాతుల మన దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ లిప్ స్టిక్ మొక్కలు.

ప్రపంచంలో ఎన్నో అరుదైన మొక్కలు. కాలక్రమేణా  వాతావరణంలో మార్పుల వల్ల అవి అంతరించిపోవడం మొదలైంది. అలా మన దేశంలో అంతరించిపోయిందనుకున్న ఓ అరుదైన మొక్కను పరిశోధకులు మళ్లీ కనుగొన్నారు. ఆ మొక్క పేరు ‘ఇండియన్ లిప్‌స్టిక్ ప్లాంట్’. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు దాదాపు వందేళ్ల తరువాత ఈ మొక్కను అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతమైన అంజావ్ జిల్లాలో కనిపెట్టారు. దీన్ని మొదటిసారి 1912లో బ్రిటీష్ వృక్షశాస్త్రజ్ఞుడు స్టీఫెన్ ట్రోయ్ట్ డన్  గుర్తించారు. ఆయన మరో ఆంగ్ల శాస్త్రవేత్త ఐజాక్ హెన్రీ బుర్కిల్ అరుణాచల్ ప్రదేశ్ నుండి సేకరించిన మొక్కల నమూనాలలో ఈ అరుదైన మొక్కలను గుర్తించారు. ఆ తరువాత మళ్లీ ఈ మొక్క జాడ లేదు. దీంతో అంతరించిపోయిందనుకున్నారు మన భారత శాస్త్రవేత్తలు. 

ఎందుకా పేరు?
లిప్ స్టిక్ మొక్క శాస్త్రీయ నామం ఎస్కినాంథస్ మోనిటేరియా డన్. దీని ఆకారం, రంగును బట్టి ‘లిప్‌స్టిక్ మొక్క’ అని పేరు పెట్టారు. చూడటానికి గొట్టంలా ఉండి ఎర్రగా లిప్ స్టిక్ ఆకారంలో కనిపిస్తుంది. అందుకే వాటికి ఆ పేరు వచ్చినట్టు శాస్త్రవేత్త కృష్ణ చౌలు తెలిపారు. ఈయన అరుణాచల్ ప్రదేశ్లోని పూలపై అధ్యయనం చేస్తున్నప్పుడు గతేడాది అంజావ్ జిల్లాలోని హ్యులియాంగ్, చిప్రూ ప్రాంతాల్లో లిప్ స్టిక్ మొక్కల నమూనాలను సేకరించారు. ఆ నమూనాలను పరీక్షించాక అది అరుదైన లిప్ స్టిక్ మొక్కగా నిర్ధారించారు. 1912 తరువాత ఈ మొక్కల నమూనాలు ఎక్కడా దొరకలేదు. అందుకే వందేళ్ల తరువాత మళ్లీ ఈ మొక్క కనిపించినట్టు గుర్తించారు. 

పేరుకు అర్థం...
ఈ మొక్కల పేరు ఎస్కినాంథస్ అని చెప్పుకున్నాం కదా. ఈ పదం గ్రీకు నుంచి వచ్చినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గ్రీకుపదమైన ఐస్కీన్ నుంచి ఇది ఉద్భవించిందని వివరిస్తున్నారు. ఐస్కీన్ అంటే అవమానం లేదా ఇబ్బందిగా భావించడం అని అర్థమట. ఇక ఆంథోస్ అంటే పువ్వు అని అర్థం. 

అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నో అందమైన పూల జాతులు, మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా అంజావ్ జిల్లాలో మరీను. కాకపోతే ఈ జిల్లాలో తరచుగా కొండచరియలు విరిగిపడడం, రోడ్ల విస్తరణ పనులు జరగడం, మార్కెట్లు కోసం భూమిని తవ్వేయడం, సాగు కోసం మొక్కలు తీసేయడం వంటివి జరుగుతున్నాయి. దీనవల్లే లిప్ స్టిక్ మొక్కల్లాంటి అరుదైన జాతులు అంతరించిపోతున్నట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Also read: మీరు చేసే ఈ పనులు కిడ్నీలను దెబ్బతీస్తాయి, కిడ్నీ మార్పిడి వరకు తెచ్చుకోవద్దు

Also read: టైప్ 3సి డయాబెటిస్‌, ఇదీ మధుమేహంలో ఓ రకమే, మీది ఇదేనేమో చెక్ చేసుకోండి

టాప్ హెడ్ లైన్స్

Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget