SCCL Jobs: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు - దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
SCCL: సింగరేణిలో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 327 పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 15న ప్రారంభంకానుంది. జూన్ 4న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Singareni Recruitmen సింగరేణిలో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే పాలనాపరమైన వ్యవహారాల కారణంగా నిర్ణీత గడువులో ప్రారంభంకాలేదు. తాజాగా దరఖాస్తు ప్రారంభ తేదీని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. అభ్యర్థుల నుంచి మే 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఈఅండ్‌ఎం, సిస్టమ్స్)-49 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు విడుదల చేశారు. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 327
* ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 49 పోస్టులు
➥ ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్ ట్రైనీ: 42 పోస్టులు
విభాగం: ఎగ్జిక్యూటివ్ క్యాడర్.
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ: 07 పోస్టులు
విభాగం: సిస్టమ్స్.
*నాన్- ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 278 పోస్టులు
➥ జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు
విభాగం: మైనింగ్.
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ: 09 పోస్టులు
విభాగం: మెకానికల్.
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ: 24 పోస్టులు
విభాగం: ఎలక్ట్రికల్.
➥ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు
విభాగం: ఫిట్టర్.
➥ ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1: 98 పోస్టులు
విభాగం: ఎలక్ట్రిషియన్.
అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2024. (12 AM నుంచి)
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.06.2024. (5 PM వరకు)
ALSO READ:
కేంద్ర సాయుధ బలగాల్లో 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్ (BSF), సీఆర్‌పీఎఫ్ (CRPF), సీఐఎస్‌ఎఫ్ (CISF), ఐటీబీపీ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB) దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి 'సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2024' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 24న విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభంకాగా.. మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..