IGCAR: ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్‌లో 91 సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
IGCAR Recruitment: కల్పక్కంలోని 'ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ వివిధ యూనిట్లలో గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా 91 ఖాళీలను భర్తీచేయనున్నారు.
Indira Gandhi Centre for Atomic Research Notification: తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని 'ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (IGCAR) దేశవ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని వివిధ యూనిట్లలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో 10+2/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 91
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ గ్రూప్-ఎ పోస్టులు
1) సైంటిఫిక్ ఆఫీసర్/ఈ (మెడికల్) (SOE-01): 01 పోస్టు
విభాగం: జనరల్ సర్జరీ.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.78,800+NPA.
2) సైంటిఫిక్ ఆఫీసర్/ఈ (మెడికల్) (SOE-02): 01 పోస్టు
విభాగం: న్యూక్లియర్ మెడిసిన్.
వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.78,800+NPA.
3) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-01): 01 పోస్టు
విభాగం: డెంటల్ ప్రోస్టోడోంటిక్స్.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
4) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-02): 01 పోస్టు
విభాగం: అనస్థీషియా.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
5) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-03): 02 పోస్టులు
విభాగం: ఆప్తాల్మాలజీ.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
6) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-04): 02 పోస్టులు
విభాగం: గైనకాలజీ.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
7) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-05): 04 పోస్టులు
విభాగం: రేడియోలజీ.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
8) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-06): 02 పోస్టులు
విభాగం: పీడియాట్రిక్స్.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
9) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-07): 01 పోస్టు
విభాగం: ఈఎన్‌టీ.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
10) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-08): 02 పోస్టులు
విభాగం: న్యూక్లియర్ మెడిసిన్.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
11) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-09): 01 పోస్టు
విభాగం: జనరల్ సర్జరీ.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
12) సైంటిఫిక్ ఆఫీసర్/డి (మెడికల్) (SOD-10): 01 పోస్టు
విభాగం: హ్యుమన్/మెడికల్ జెనెటిసిస్ట్.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700+NPA.
13) సైంటిఫిక్ ఆఫీసర్/సి (మెడికల్) (SOC-01): 15 పోస్టులు
విభాగం: జనరల్ డ్యూటీ/క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,100+NPA.
➥ గ్రూప్-బి పోస్టులు
14) టెక్నికల్ ఆఫీసర్/B (TOB-01): 01 పోస్టు
విభాగం: ఫిజియోథెరపీ.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.47,600.
15) సైంటిఫిక్ అసిస్టెంట్/ సి (SAC-01): 01 పోస్టు
విభాగం: మెడికల్ సోషల్ వర్కర్.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,900.
16) నర్సు/ఎ (NUR-01): 27 పోస్టులు
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,900.
17) సైంటిఫిక్ అసిస్టెంట్/బి (SAB-01): 06 పోస్టులు
విభాగం: పాథాలజీ.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400.
18) సైంటిఫిక్ అసిస్టెంట్/బి (SAB-02): 01 పోస్టు
విభాగం: రేడియోగ్రఫీ.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400.
19) సైంటిఫిక్ అసిస్టెంట్/బి (SAB-03): 04 పోస్టులు
విభాగం: న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400.
➥ గ్రూప్-సి పోస్టులు
20) ఫార్మసిస్ట్/బి (PHM-01): 14 పోస్టులు
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.29,200.
21) టెక్నీషియన్/బి ((TNB-01): 01 పోస్టు
విభాగం: ఆర్థోపెడిక్ టెక్నీషియన్.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700.
22) టెక్నీషియన్/బి (TNB-02): 01 పోస్టు
విభాగం: ఈసీజీ టెక్నీషియన్.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700.
23) టెక్నీషియన్/బి - (TNB-03): 01 పోస్టు
విభాగం: కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు రూ.300. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, నర్స్ పోస్టులకు రూ.200. ఫార్మసిస్ట్, టెక్నీషియన్ పోస్టులకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్స్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.06.2024.