Delhi High Court: ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ - 2023, వివరాలు ఇలా
Delhi High Court News: ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
Delhi High Court Jobs 2023: ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జనరల్- 34, ఎస్సీ- 05, ఎస్టీ- 14 పోస్టులను కేటాయించారు. వీటిలో దివ్యాంగులకు 9 పోస్టులు కేటాయించారు. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), మెయిన్స్(రాతపరీక్ష), వైవా-వోస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష రెండు దశలుగా నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఈ పరీక్షలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో మెయిన్స్(రాతపరీక్ష) నిర్వహిస్తారు. తదనంతరం మెయిన్స్(రాతపరీక్ష)లో అర్హులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 53
పోస్టుల కేటాయింపు: జనరల్- 34, ఎస్సీ- 05, ఎస్టీ- 14. మొత్తం ఖాళీల్లో దివ్యాంగులకు 9 పోస్టులు కేటాయించారు.
అర్హత: న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసిన వారై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5సంవత్సరాలు, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400. అభ్యర్థులు క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), మెయిన్స్(రాతపరీక్ష), వైవా-వోస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్షవిధానం: ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష వరుసగా రెండు దశలుగా జరుగుతుంది. ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. 25% నెగిటివ్ మార్కులను కలిగి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై ఐన అభ్యర్థులకు మెయిన్స్(రాతపరీక్ష)కు అర్హత లభిస్తుంది. మెయిన్స్(రాతపరీక్ష)లో క్వాలిఫై ఐన అభ్యర్థులకు వైవా-వోస్ కోసం కాల్ చేస్తారు.
➥ ప్రిలిమినరీ పరీక్షను స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ లీగల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలుగా నిర్ణయించారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 60 శాతంగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 55 శాతంగా నిర్ణయించారు.
➥ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. మొత్తం 850 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 జనరల్ లీగల్ నాలెడ్జ్ & లాంగ్వేజ్-250 మార్కులు, పేపర్-1 సివిల్ లా-I 200 మార్కులు, పేపర్-3 సివిల్ లా-II 200 మార్కులు, పేపర్-4 క్రిమినల్ లా 200 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు.
జీతం: రూ.77840-136520.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07.11.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.11.2023
➥ ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)తేదీ: 10.12.2023