అన్వేషించండి

BJP: దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కు ఉంది, కానీ బీఆర్ఎస్‌తో ఏ లాభం లేదు: కిషన్ రెడ్డి

2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

- దేశాభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామిని చేస్తూ ముందుకెళ్లాలన్నదే ప్రధానమంత్రి సందేశం
- అప్పుడే సమగ్రమైన పురోగతి సాధ్యమని ప్రధాని చెప్పారన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- 2024 పార్లమెంటు ఎన్నికలు నడ్డా నేతృత్వంలోనే.. ఆలోపలే 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా..
- బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది
- వారిని త్వరలోనే ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయం అన్న కిషన్ రెడ్డి
- ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం 2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని ఆయన అన్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ రెండ్రోజుల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు రానున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జేపీ నడ్డా నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమావేశాల ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీ ఆధర్వ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారన్నారు. 
 
2047 వరకు నిర్దేశించుకున్న అమృత కాలాన్ని ప్రస్తావిస్తూ.. మన పూర్వీకుల ఆకాంక్షలను పూర్తిచేసేందుకు సరైన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాలకు కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని ప్రధాని మార్గదర్శనం చేశారన్నారు. 

దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కుందని, కానీ ప్రజల ఆకాంక్షలను వదిలిపెట్టి రాజకీయాలు చేస్తే ఆ ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం లేదని, రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిన కుటుంబం.. దేశాన్ని దోపిడీ చేద్దామని అనుకుంటోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీకి భూమి కదిలిపోతోందని, అలాంటిది దేశ రాజకీయాల్లోకి వచ్చి కల్వకుంట్ల కుటుంబం సాధించేది ఏమీ ఉండదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని అందుకే త్వరలోనే ఈ కుటుంబాన్ని ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో రాజకీయ పరిస్థితులపై "రాజకీయ తీర్మానం" ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రజలని నమ్ముకొని నాయకులు ఎన్నికలకి వెళ్తున్నారు, కానీ తెలంగాణ లో మాత్రం పైసలు తో ఎన్నికలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఆత్మాభిమానానికి చిహ్నం అయిన ఓటుకు కెసిఆర్ వెలకడుతున్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. టికెట్ ఇచ్చే ముందే ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పరిస్థితిని మారాలన్నారు. కేంద్రం అయినా  రాష్ట్రం అయినా  (ప్రజా ధనం) ప్రజల పైసలు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రులు "నేను" ఖర్చు పెట్టిన అంటున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు అన్నారు. ప్రజాస్వామ్యంలో "నేనే" అని చెప్పుకొనే పరిస్థితి మారాలన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వాలు పధకాలు ప్రవేశపెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget