Omicron Variant: 'ఒమిక్రాన్‌ వల్ల మరో వేవ్ వస్తే.. ఇక అంతే'.. కొత్త వేరియంట్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ABP Desam Updated at: 29 Nov 2021 06:00 PM (IST)
Edited By: Murali Krishna

ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. దీని వల్ల మరో వేవ్ వస్తే పరిస్థితి చేయదాటిపోతుందని వ్యాఖ్యానించింది.

ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

NEXT PREV

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెనుముప్పుగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.  వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను తప్పించుకునే మ్యూటేషన్లు రెండూ ఒమిక్రాన్ వేరియంట్‌లో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కనుక ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది.



ఒమిక్రాన్ వల్ల కొవిడ్ 19 కేసులు పెరిగితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఒమ్రికాన్ వేరియంట్ సోకి చనిపోయినట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు.                                    -    డబ్ల్యూహెచ్ఓ


ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సౌతాఫ్రికాతో పాటు పశ్చిమ పసిఫిక్, ఐరోపా, తూర్పు మెడిటెరెనియన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ను  గుర్తించారు. అంతర్జాతీయ ప్రయాణికుల వల్ల ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.


డబ్ల్యూహెచ్ఓ సూచనలు..



  • నిరంతర పర్యవేక్షణ, వైరస్ కట్టడి చర్యలతో పాటు ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తిపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలకు అవగాహన ఉండాలి.

  • ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు ఎస్‌జీటీఎఫ్ కలిగిన పీసీఆర్ టెస్ట్ చేయాలి. దీని వల్ల ఒమిక్రాన్‌ను గుర్తించడం సులభం. 

  • ఒమిక్రాన్ కేసులను, వ్యాప్తి చెందుతోన్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్ఓకు తెలియజేయాలి. శాంపిళ్లలో ఎంతమేరకు ఒమిక్రాన్ వేరియంట్ నిష్పత్తి ఉందో తెలపాలి. 

  • కొవిడ్ 19 వ్యాక్సినేషన్ జోరుగా సాగాలి. పెంచాలి. 

  • అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. 


Also Read: Rajya Sabha: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. వర్షాకాలంలో తప్పు చేస్తే శీతాకాలంలో శిక్ష!


Also Read: Omicron Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్.. 'ఒమ్రికాన్' అనుకొని హైఅలర్ట్!


Also Read: Farm Laws Repealed: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. రైతుల హర్షం


Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత


Also Read: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త



Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Also Read: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 29 Nov 2021 05:48 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.