కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్‌పై ఇప్పటికే భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఠానెలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కల్యాణ్ దోంబివాలీ ముస్పిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
అయితే అతనికి సోకింది ఒమ్రికాన్ వేరియంట్ సోకిందా లేదా సాధరణమైనా కొవిడ్ అన్న విషయంపై స్పష్టత లేదు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి నవంబర్ 24న బాధితుడు దోంబివాలీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతను ఎవరినీ కలవలేదు. ప్రస్తుతం అతను ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్నాడు. కేడీఎమ్‌సీ ఆరోగ్య సిబ్బంది హైఅలర్ట్‌లో ఉన్నారు. కొత్త వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం. - డా. ప్రతిభా పాటిల్, ఆరోగ్య అధికారి