దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ GDCE పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
RRC సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2021 కింద RRC సికింద్రాబాద్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నవంబర్ 17 నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. డిసెంబర్ 16 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.
ఉద్యోగం వివరాలు
| పోస్టు పేరు | జూనియర్ ఇంజినీరంగ్ |
| ఆర్గనైజేషన్ | ఆర్‌ఆర్‌సీ సికింద్రాబాద్ |
| విద్యార్హతలు | సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కానీ బీఎస్సీ కానీ ఉత్తీర్ణులై ఉండాలి |
| అనుభవం | ఉంటే ప్రయార్టీ ఇస్తారు |
| జాబ్ లొకేషన్ | సికింద్రాబాద్ |
| అప్లికేషన్ స్టార్ట్ | నవంబర్ 17, 2021 |
| అప్లికేషన్లకు తుది గడువు | డిసెంబర్ 16,2021 |
వయసు, ఫీజు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు వయసు 42 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీ అభ్యర్థుల వయసు 45 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల వయసు 47 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఈ వయసును 2022 జనవరి 1 నాటికి లెక్కిస్తారు.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
| UR | 50 |
| OBC | 18 |
| SC | 12 |
| ST | 01 |
| మొత్తం ఖాళీలు | 81 |
విద్యార్హతలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీఎస్సీ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక విధానం
దరఖాస్తుల స్వీకరణ పూర్తైన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్టు ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే
203.153.33.92/Notifi.htm లింక్ ద్వారా అప్లై చేయవచ్చు.
Also Read : NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం..
Also Read: నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
Also Read: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి