తెలంగాణలో కొద్ది నెలల క్రితం సంచలనం రేపిన మరియమ్మ అనే మహిళ జైలులోనే చనిపోయిన (లాకప్ డెత్) కేసులో తెలంగాణ హైకోర్టు సోమవారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. మరియమ్మ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం తగ్గే అవకాశం ఉందని అడ్వకేట్‌ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. దీంతో కోర్టు తాజా తీర్పు వెలువరించింది.


జైలులో మరియమ్మ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్‌లో జూన్ నెలలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఓ దొంగతనం కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఈ క్రమంలోనే ఆమె చనిపోయింది. విచారణ పేరుతో మరియమ్మపై పోలీసులు స్టేషన్‌లో థర్ఢ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పోలీసు దెబ్బలకు తాళలేక మరియమ్మ స్పృహ కోల్పోయి పడిపోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన ఆర్ఎంపీ వైద్యుడు పల్స్‌ దొరకడం లేదని.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఆమెను హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు తేల్చారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల నుంచే కాక, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి విపరీతమైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. 


పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలికి న్యాయం చేకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను వీధుల నుండి తొలగించింది. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. 


Also Read: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష


Also Read: Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత


Also Read: Sajjanar: చక్రాలపై మన భవిష్యత్ భద్రంగా ఉంది.. బస్సులో హోం వర్క్ చేస్తున్న విద్యార్థి వీడియో ట్వీట్ చేసిన సజ్జనార్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి