నేడు (నవంబరు 29) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్.. క్వారంటైన్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కావొస్తుండడంతో.. బూస్టర్ డోస్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు, తెలంగాణలో ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో యాసంగి పంటల సాగుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. యాసంగి సీజన్‌లో వరి పంటపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి రానుంది. ధాన్యం కొనుగోళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త జోనల్ విధానం అమలు తర్వాత 70 నుంచి 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఆ ప్రక్రియ ఎంత వరకూ వచ్చిందనే అంశంపైనా ఆరా తీయనున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం.
Also Read: Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
Also Read: Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..