చిత్తూరు జిల్లా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం టీటీడీ భక్తులకు అందించింది. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేయగా కేవలం 10 నిమిషాలలో దర్శన టికెట్లు అయిపోయాయని సమాచారం. ప్రతినెల టికెట్లను ముందు నెల చివర్లో షెడ్యూల్ ప్రకారం టీటీడీ అధికారులు విడుదల చేస్తుంటారు. 


వచ్చే నెలకుగానూ టీటీడీ రోజూ 10 వేల టికెట్ల చొప్పున కేటాయిస్తుంది. నేటి ఉదయం డిసెంబర్ నెల సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్లో విడుదల చేయగా.. నిమిషాల వ్యవధిలో శ్రీవారి భక్తులు టికెట్లు బుకింగ్ చేసుకున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వర్చువల్ క్యూ, ఓటీటీ పద్ధతిలో టీటీడీ అధికారులు భక్తులకు టికెట్లు కేటాయించారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అద్దె గదుల కోటా టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. టీటీడీ 2018లో ఆకాశ‌వాణితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ ఉద‌యం 3 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. ఆకాశ‌వాణికి ఏడాదికి టీటీడీ అధికారులు రూ.35 ల‌క్షల చొప్పున చెల్లించనున్నారు.
Also Read: Horoscope Today 27 November 2021: ఈ రాశివారికి సలహాలు ఇవ్వాలనే సరదా ఎక్కువ, ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..


నేటి ఉదయం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కమిటీ సభ్యులు కునాల్ సత్యార్థి., అభేయ్ కుమార్, డాక్టర్ కె మనోహరణ్, శ్రీనివాసు బైరి, శివాని శర్మ, శ్రవణ్ కుమార్ సింగ్, అనిల్ కుమార్ సింగ్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి