News
News
వీడియోలు ఆటలు
X

UTI: పిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్‌ని గుర్తించడం ఎలా? చికిత్స ఏమిటి?

పెద్దలు మాత్రమే కాదు పిల్లల్లో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

FOLLOW US: 
Share:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా పెద్దల్లో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తుంది. మూత్రనాళం అనేది శరీరానికి డ్రైనేజీ వ్యవస్థగా పని చేస్తుంది. మూత్రాన్ని బయటకి పంపిస్తుంది. ఇందులో రెండు కిడ్నీలు, రెండు మూత్ర నాళాలు, ఒక మూత్రాశయం ఉన్నాయి. ఆరోగ్యకరమైన మూత్ర నాళ వ్యవస్థ మొత్తం ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. కానీ ఇది బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంది. దీన్నే యూరనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్(UTI) అని కూడా పిలుస్తారు. UTI రెండు రకాలుగా ఉంటుంది. ఎగువ, దిగువ UTI. కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా మూత్రనాళాల ఇన్ఫెక్షన్, మూత్రపిండాలు మూత్రాశయానికి అనుసంధానించే ట్యూబ్ లు ఉన్నప్పుడు ఎగువ UTI అంటారు. దిగువ UTI అనేది మూత్రాశయం నుంచి మూత్రాన్ని శరీరం నుంచి బయటకి తీసుకెళ్ళే గొట్టం.

పిల్లల్లో UTI కి కారణమేంటి?

నేషనల్ హెల్త్ సర్వీస్ సమాచారం ప్రకారం పిల్లల్లో చాలా UTI సమస్య జీర్ణవ్యవస్థ నుంచి మూత్రనాళంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి. ఇది అనేక విధాలుగా జరుగుతుంది. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేసినకి మూత్రాశయం, మూత్రనాళాలు, మూత్రపిండాల వరకు వచ్చి చేరుతుంది. శిశువుల విషయంలో మూత్రనాళంలోకి బ్యాక్టీరియా ప్రవేసినకి ఇన్ఫెక్షన్ ప్రమాదానికి గురి చేస్తుంది.

పిల్లల్లో UTI ఇన్ఫెక్షన్ లక్షణాలు

UTI ఇన్ఫెక్షన్ సోకితే పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

⦿ అధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం

⦿ వాంతులు

⦿ అలసట

⦿ శక్తి లేకపోవడం

⦿ చిరాకు

⦿ ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది

⦿ చర్మం, కళ్ళలోని తెల్లటి గుడ్డు పసుపు రంగులోకి మారడం(కామెర్లు)

UTI  లక్షణాలు

⦿ మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించడం

⦿ తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం

⦿ బెడ్ తడిపేయడం

⦿ కడుపులో నొప్పి

⦿ మూత్రం దుర్వాసన రావడం

పిల్లల్లో UTI ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?

తగినంత ద్రవాలు తాగేలా చేయాలి. బాత్రూమ్ ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. పిల్లలకు ఎప్పటికప్పుడు డైపర మార్చుకుంటూ ఉండాలి. వదులుగా ఉండే బట్టలు ధరించాలి. వైద్యులని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే UTI ని నిరోధించవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డీసీజెస్ తెలిపింది.

చికిత్స ఎలా?

పిల్లల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించుకునేందుకు యాంటీ బయాటిక్స్ మందులతో చికిత్స చేయవచ్చు. పిల్లల వయసు ఆధారంగా యాంటీ బయాటిక్స్ వాడాలి. రెండు నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సాధారణంగా నోటి ద్వారా యాంటీ బయాటిక్ తీసుకుంటారు. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి సమస్య నుంచి బయటపడొచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారులకు పుష్కలంగా నీరు తాగించాలి. నొప్పిని తగ్గించేందుకు  పిల్లల వీపు లేదా పొత్తి కడుపుపై హితినగ ప్యాడ్ ఉపయోగించడం వంటివి చేస్తే ఉపశమనం లభిస్తుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: భుజం నొప్పి విపరీతంగా ఉంటుందా? ఈ ప్రమాదం పొంచి ఉంది!

Published at : 13 Apr 2023 08:00 AM (IST) Tags: kids health UTI Urinary Tract Infection UTI Symptoms In Children

సంబంధిత కథనాలు

Sleeping Together: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Sleeping Together: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!

Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట

Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?

పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్