PawanKalyan Songs: ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే' vs జల్సా 'ఛలోరే'! రెండు పాటలూ సేమ్ టు సేమ్! లిరిక్స్ గమనించారా?
Dekh Lenge Saala Lyrics : పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్ లేంగే సాలా సాంగ్ వచ్చింది. ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది ఆ సాంగ్. అయితే పాట ఛలోరే సాంగ్ లా ఉందని గమనించారా?

Pawan Klayna: పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. రీసెంట్ గా ఈ సినిమా నుంచి దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ లో జోష్, పవన్ లుక్, దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ యూత్ ని కట్టిపడేస్తున్నాయ్. అందులో మీనింగ్ గమనించారా? త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జల్సాలో ఛలోరే ఛలోరే ఛల్ సాంగ్ లా ఉంది.
ఈ రెండు పాటలు మోటివేషనల్ సాంగ్సే.. లిరిక్స్ వెనుకున్న అర్థం, ఆంతర్యం దాదాపు ఒక్కటే..
దేఖ్ లేంగే సాలా ( ఉస్తాద్ భగత్ సింగ్)
భాస్కరబట్ల రాసిన లిరిక్స్ ని విశాల్ దద్లాని గాత్రం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా అంటే ఇప్పటికే చాలా చూశాం..చాలా ఎదుర్కొన్నాం..ఇకపై వచ్చే ఎలాంటి సవాళ్లకైనా సిద్ధం అని అర్థం
హే బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా... రే ఆఫ్ హోపే తగ్గుతున్నా..టగ్ ఆఫ్ వారే జరుగుతున్నా... టేకాఫ్ లేటయ్యినా...
ఈ లిరిక్స్ జీవితంలో సవాళ్లు, ఆలస్యాలు, దుఃఖం వచ్చినా ఎదుర్కోవాలని సూచిస్తోంది
ప్రాబ్లెమ్స్ ను నో ఎంట్రీ బోర్డ్ పెట్టి తరిమేయాలి అనే లిరిక్.. పట్టుదల, నిశ్చయం మీద ఫోకస్ చేస్తోంది
ఈ పాట మొత్తం పార్టీ మూడ్ లో సాగడం, డాన్స్ మూమెంట్స్, పవర్ స్టార్ స్టెప్స్ తో ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. అయితే.. ఇంచుమించు ఇదే అర్థంలో సాగే ఛలోరే సాంగ్ బ్యాక్ డ్రాప్ పూర్తి భిన్నంగా ఉంటుంది
సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆ పాట చాలామందికి ఫేవరెట్. ఇప్పటికీ మోటివేషనల్ సాంగ్స్ లో టాప్ లో ఉంటుంది. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా అనే లిరిక్స్ మొత్తం జీవిత పాఠం చెప్పేలా ఉంటాయ్. జీవితంలో పారడాక్స్ లు ( ధీరులు-దీనులు , సంహారం-సహవాసం), స్వయం -శత్రుత్వం, పురాతన-ఆధునిక తేడాలు గిరించి చర్చించేలా ఉంటుంది. చంపడం బతకడానికి కాదు నమ్మకాలను ప్రశ్నించాలి అని. ఇది స్వీయ పరిశీలన పాట. జీవిత సంక్లిష్టతల మధ్య ముందుకు సాగాలని సూచిస్తుంది
రెండు పాటలూ మోటివేషనల్, ముందుకు సాగడం, ఛాలెంజెస్ ఎదుర్కోవడం, పట్టుదల గురించే. దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా అనేది అనుభవాలు నేర్పించిన ధైర్యం. ఛలోరే ఛలోరే లో నీ పయనం ఎక్కడికో అనేది సెల్ఫ్ అవేర్ నెస్..రెండింటిలోనూ జీవితం అంటే యుద్ధం అనే అర్థం.
( ఈ లిరిక్స్ గమనించండి..రెండింటిలోనూ ఓ హోప్ కనిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ లిరిక్స్ నిన్ను నీకు గుర్తుచేస్తుంటే.. జల్సా సాంగ్ లిరిక్స్ నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తోంది)
ఉస్తాద్ భగత్ సింగ్ లో
నీ కాలి కింద ఉన్న నేల... నీ సొంతమంటే నమ్మవేలా..చీకాకు లేని ఓ పీకాకు లాగా నువ్వు చిందేస్తే గోల గోల...
యారో ఏడి నుంచి వచ్చి గుచ్చుకున్నా... న్యారో మైండుగాళ్లు పీక పట్టుకున్నా..సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా...
జల్సాలో
రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం.. రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం..రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
ఓవరాల్ గా..
దేఖ్ లేంగే సాలా సాంగ్ ఎనర్జటిక్ , డాన్స్ ఓరియెంటెండ్, యూత్ ఫుల్ సాంగ్
ఛొలోరే సాంగ్ ఫిలసాఫికల్, డీప్ థింకింగ్ సాంగ్
సినిమాలపరంగా చూస్తే..
జల్సాలో ఛలోరే సాంగ్ హీరో ప్రయాణాన్ని సింబలైజ్ చేస్తుంది..గతాన్ని ప్రశ్నించి ముందుకు సాగమని సూచిస్తుంది
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పాట హీరో ధైర్యం, సమాజంలో సవాళ్లను ఎదుర్కొని దూసుకెళ్లడాన్ని హైలైట్ చేస్తుంది
ఛలోరే సాంగ్ ఆత్మావలోకనం.... దేఖ్ లేంగే ధిక్కారం..ఓవరాల్ గా రెండూ మోటివేషనల్ సాంగ్సే..పవన్ ఫ్యాన్స్ కి ఎనర్జీ బూస్టర్సే...






















