Trinayani Serial Today January 2nd: 'త్రినయని' సీరియల్: నయని కోమా విషయం సుమనకు చెప్పేసిన విక్రాంత్.. పాపపై వైకుంఠం విషప్రయోగం!
Trinayani Today Episode కోమాలో ఉన్న నయనిని గాయత్రీ పాప దాచి పెట్టడం ఆ విషయం నయని, విక్రాంత్ వాళ్లకి తెలీకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode బామ్మ పొరపాటు పడిందని వైకుంఠం అందరికీ క్షమాపణ చెప్తుంది. బామ్మ నయనితో నేను కోమాలో ఉన్న నయనిని చూశాను అని గాయత్రీ పాప మీద ఒట్టేసి నువ్వు నయనివా త్రినేత్రివా చెప్పు అని బామ్మ అడుగుతుంది. దాంతో నయని, విక్రాంత్, దురంధర షాక్ అయిపోతారు. వల్లభ వాళ్లు అలాగే చేయమంటారు. దాంతో నయని చెప్తాను అని పాపని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది.
నయని: నేను ఎవరు అన్నది పూర్తిగా చెప్పక్కర్లేదు ఒక్క మాటలో విశాలాక్షి అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ చెప్తున్నా నేను కన్న తొలి బిడ్డ నా పెద్ద కూతురు ఈ గాయత్రీ పాప.
విక్రాంత్: చాలా ఇంకేమైనా కావాలా.
సుమన: మీ మనవరాలికి ఇంకా పెళ్లే కాలేదు గాయత్రీ పాపని బిడ్డ అని చెప్పలేదు.
హాసిని: ఇంకేం కావాలి ఇక పదండి పదండి.
విక్రాంత్: బామ్మ గారు మీరు మా వదినలోనే త్రినేత్రిని చూసుకోవాలి అంతకు మించి మీకు వేరే దారిలేదు.
దురంధర: మొత్తానికి గండం గడిచింది.
నయని: అది సరే పిన్ని మరి కోమాలో ఉన్న నన్ను ఎవరు దాచినట్లు. గాయత్రీ పాప బెడ్ కింద బ్లాంకెట్స్ వేసి వాటి మీద నయనిని లాగి లాక్కుంటూ దాచిపెడుతుంది.
విక్రాంత్: మనసులో కోమాలో ఉన్న నయని వదిన ఏమైనట్లు. వదినను అడిగితే నాకు తెలీదు అంటుంది. మరి ఎవరు మార్చేసి ఉంటారు.
సుమన: ఏమైంది బుల్లిబావగారు అంతగా ఆలోచిస్తున్నారు మీకు కొలిక్కిరాని సమస్య ఉంది కదా అది నాకు చెప్తే నేను పరిష్కరిస్తాను.
విక్రాంత్: అవునా అలాగా అయితే బామ్మగారు చెప్పినట్లు నయని వదినను వెతుకు అయితే.
సుమన: ఇలా అన్నందుకు మిమల్ని నేను ఏం అనను కానీ ఇంట్లో మా అక్కని పెట్టుకొని మళ్లీ మా అక్కని వెతికితే నన్ను పిచ్చిదానిలా చూస్తారు. ముసలిదానిలా మీకు మతిపోయినట్లుంది. వస్తాను.
విక్రాంత్: దీనికి లేనిపోని అనుమానాలు రాకూడదు అని ఇలా అన్నాను ఇక ఆ గది గురించి ఆలోచించదు. ఈలోపే నేను బాడీ ఎవరు తీసుకెళ్లారో కనిపెట్టాలి.
తిలోత్తమ, వల్లభలు బామ్మ మాటలు గురించే ఆలోచిస్తుంటారు. బామ్మ లాంటి వాళ్లు అబద్ధం చెప్పరని చెప్తే చనిపోయిన తర్వాత వైకుంఠ దర్శనం అవ్వదని అలాంటి వాళ్లు నమ్ముతారని తిలోత్తమ అంటుంది. గదిలో నయనిని చూసిందని గదిలో ఎవరో నయనిని మాయం చేసుంటారు అని అంటుంది. నయని, త్రినేత్రి గురించి కచ్చితంగా తెలియాలి అంటే ఒక మర్డర్ చేయాలి అని తిలోత్తమ వల్లభతో చెప్తుంది వల్లభ షాక్ భయపడిపోతాడు. తిలోత్తమ తన ప్లాన్‌ని కొడుకుతో చెప్తుంది. ఇక బామ్మ మతి మరుపు వచ్చిందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. నయని, హాసిని అక్కడికి వెళ్తారు. నయని బామ్మతో నువ్వు చూసింది చెప్పింది నిజమే కానీ నువ్వు నిరూపించలేకపోయావ్ కాబట్టి అబద్దం అని నయని అంటుంది. తనకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని బామ్మ అంటుంది. హాసిని నయనితో త్రినేత్రి ఉందా లేదా అని అంటే నేనే త్రినేత్రిని అని నయని అంటుంది. బామ్మని ఓదార్చడానికి ఇలా చేస్తుందని హాసిని అనుకుంటుంది. హాసిని బామ్మతో నయని లేకపోతే త్రినేత్రి ఉన్నట్లే కదా అని అంటుంది.
బామ్మ: అలా అయితే నాతో ఊరు రమ్మంటే వచ్చేస్తావా.
నయని: రాను బాబుగారిని పిల్లల్ని చూసుకోవాలి కదా.
బామ్మ: చూశావా హాసిని ఇలా అన్నది అంటే తను నయని అనే కదా.
హాసిని: కదా అలాంటప్పుడు నువ్వు మా చెల్లిని ఎందుకు ఊరు తీసుకెళ్లిపోతావ్.
తిలోత్తమ, వల్లభల దగ్గరకు వైకుంఠం పాలు తీసుకొని వస్తుంది. తిలోత్తమ వైకుంఠానికి నెక్లెస్ గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇక పాలలో తిలోత్తమ విషం కలుపుతుంది. ఆ పాలను పాపకి తాగించమని తిలోత్తమ వైకుంఠానికి చెప్తుంది. వైకుంఠం భయపడుతుంది. ఈ విషం గురించి మన ముగ్గురికి మాత్రమే తెలుసు ఎందుకంటే మనం చూశాం కానీ నయని మాత్రం తన దివ్యదృష్టితో చూడగలదు అని ప్రమాదం జరగక ముందే ఈ పరీక్ష ఆగిపోతుందని కంగారు పడొద్దని చెప్తుంది. వైకుంఠం పాలు తీసుకొని వెళ్తుంది. వైకుంఠాన్ని ఇరికించేశాం అని తిలోత్తమ అంటుంది. ఆ పాలు తాగితే పునర్జనమ్మలో ఉన్న మీ పెద్దమ్మ పని అయిపోతుందని ఒక వేళ పాలు చేయి మారితే నయని పసిగడుతుందని అలా చేయలేకపోతే తను త్రినేత్రి అని తెలుస్తుందని అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!