Jagadhatri Serial Today JULY 17th: మీనన్‌ను ఎన్‌కౌంటర్ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్
Jagadhatri Serial Today Episode July 17th: మీనన్‌ను ఎన్‌కౌంటర్ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కౌషికి ఇంట్లో చిచ్చుపెట్టేందుకు ఆదిలక్ష్మీ ప్రయత్నాలు చేస్తుంది. బెయిల్‌పై మినిస్టర్ బయటకు వెళ్లిపోవడంతో మీనన్ కూడా తప్పించుకుంటాడని భావించిన జేడీ అతన్ని ఎన్‌కౌంటర్ చేయడానికి సాధును పర్మిషన్ అడుగుతుంది. దీనికి సాధూ ఓకే చెప్పడంతో మీనన్‌ను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేయించి తీసుకెళ్తుంది.
ఆదిలక్ష్మీ చిచ్చు
పచ్చగా ఉన్న కౌషికి కుటుంబంలో చిచ్చుపెట్టాలని వచ్చిన ఆదిలక్ష్మీ అందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు. అందరూ భోజనాలు చేసేందుకు కూర్చుని ఆదిలక్ష్మిని పిలుస్తారు.అప్పుడే కాచీ పిల్లాడిని ఆడిస్తుండటం చూసి మండిపడుతుంది.గట్టిగా అరిచి కాచీ చేతుల్లో నుంచి పిల్లాడిని తీసుకుంటుంది. ఇంకోసారి పిల్లాడిని ఎత్తుకుంటే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు అత్తయ్యా అని కాచీ అడగ్గా...పిల్లలులేని గొడ్రాలివి నువ్వు పిల్లాడిని ఎత్తుకోకూడదని తెలియదా అని అంటుంది. దీంతో ఇంట్లో అందరూ షాక్ తింటారు. మీవాళ్లు నిన్నుఏమీ అనకపోవచ్చు...కానీ నీ బుద్ధి ఏమైందని నిలదీస్తుంది. గొడ్రాళ్లు పిల్లలను ఎత్తుకుంటే వారి ఆరోగ్యం పాడైపోతుందని అరుస్తుంది.ఈ మాటలు విన్న ఇంట్లో అందరూ ఆదిలక్ష్మీపై మండిపడతారు. కౌషికి అత్తగా నీకు ఇంట్లో గౌరవం ఇస్తాం కానీ....ఇంట్లోవాళ్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని సుధాకర్ అంటాడు. ఆదిలక్ష్మీ మాటలను నొచ్చుకుని కాచీ వెళ్లిపోతుంది. దీంతో నేను ఇంట్లో ఉండటం ఎవ్వరికీ ఇష్టం లేదని నేను వెళ్లిపోతానని ఆదిలక్ష్మీ అంటుంది. దీంతో ఆమెను కౌషికి సముదాయించి లోపలికి తీసుకెళ్తుంది.
మినిష్టర్‌కు బెయిల్
సాధూ నుంచి జేడీకి ఫోన్ వస్తుంది.మినిస్టర్ హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని వెళ్లిపోయాడని చెప్పడంతో వాళ్లు షాక్ తింటారు. ఆరుగురు పిల్లల ప్రాణాలు తీసిన రాక్షసుడువాడని వాడికి బెయిల్ ఎలా వచ్చిందని అడుగుతుంది.తప్పుడు సాక్ష్యాలు చూపించి..ఆ మినిస్టర్‌కు ప్రాణహాని ఉందని చెప్పి బెయిల్‌పై బయటకు వెళ్లిపోయాడని చెబుతాడు.దీంతో జేడీ,కేడీ వెంటనే స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లను చూసిన మీనన్ బిగ్గరగా నవ్వుతూ నేనే ముందే చెప్పాను కదా నువ్వు నన్ను అరెస్ట్ చేసినా...నేరం నిరూపించలేవని అంటాడు.ఇప్పుడు మినిస్టర్ బయటకు వెళ్లాడు...రేపు నేను కూడా అలాగే వెళ్లిపోతానని హేళన చేస్తాడు. దీంతో జేడీ,కేడీ అక్కడి నుంచి వచ్చేస్తారు.
మీనన్ ఎన్‌కౌంటర్
ఇలా తప్పులు చేసినవాళ్లు తప్పించుకుని తిరిగితే ఎలా సార్ అని జేడీ సాధూను అడుగుతుంది. చట్టంలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉంటారని అంటాడు.అయితే మీనన్‌ను ఎన్‌కౌంటర్ చేద్దాం సార్ అని అంటుంది. అలా చేస్తే మీ అమ్మ నిర్దోషి అని నిరూపించడం కష్టమవుతుందమ్మా అని అంటాడు. మా అమ్మలాంటి మరొకరి ప్రాణాలు పోకుండా కాపడటం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదని జేడీ అంటుంది. అయితే ఓకే అంటాడు.ఎన్‌కౌంటర్‌కు ఏర్పాట్లు చేసుకోమని పర్మిషన్ ఇస్తాడు. మీనన్‌ను కోర్టుకు తీసుకెళ్తామని చెప్పితీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేద్దామని చెబుతుంది. అందుకే మీడియాను కూడా పిలుస్తానని అంటుంది. సాధూ సరేనంటాడు.
కిడ్నాప్ డ్రామా
మీనన్‌ను కోర్టుకు తీసుకెళ్తున్నారంటే ఏదో ప్లాన్ చేసి ఉంటారని మినిస్టర్ అనుమానిస్తాడు.మీనన్ నోరు తెరిస్తే నా చాఫ్టర్ క్లోజ్ అవుతుంది.అలా కాదనివాడు చచ్చిపోయినా నా వ్యాపారాలన్నీ ఆగిపోతాయి.కాబట్టి వాడిని కాపాడి తీసుకు రమ్మని ...పోలీసుస్టేషన్‌పైనే ఎటాక్ చేయమని రౌడీలను పంపుతాడు. జేడీ మీడియా ముందు మీనన్ ప్రవేశపెట్టి కోర్టుకు తీసుకెళ్తుండగా రౌడీలు వచ్చి దాడి చేస్తారు. మీడియాలో అదంతా కవర్ అవుతుంది. జేడీ,కేడీ రౌడీల ముసుగులు వేసుకుని మీనన్‌ను ఎత్తుకెళ్లిపోతారు. మీనన్ కూడా వాళ్లు తన మనుషులేనని సంబరపడిపోతాడు. తీరా నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత వచ్చింది జేడీ,కేడీ అని తెలుసుకుని షాక్ తింటాడు.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















