Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 19th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా ప్రెగ్నెంట్.. లక్ష్మీకి హెచ్చరిక.. జానుకి ఇక జీవితంలో పిల్లలు పుట్టరా..!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జానుకి ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్పడం వివేక్ తనకు ప్రాబ్లమ్ ఉన్నట్లు రిపోర్ట్ తీసుకోని జానుకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను వివేక్‌లు హాస్పిటల్‌కి వెళ్తారు. జాను డల్‌గా ఉంటే వివేక్ టెన్షన్ పడొద్దని ధైర్యం చెప్తాడు. త్వరగా పిల్లల్ని కనమని మా అమ్మ సతాయిస్తుంది కానీ ఎప్పుడు జరగాల్సింది అప్పుడ జరుగుతుందని అంటాడు. అప్పుడే ఓ జంట బయటకు వస్తారు. అబ్బాయి తనకు పిల్లలు పుట్టరు అని ఏడుస్తాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందని పిల్లలు లేని ఇళ్లు కానే కాదని ఏడుస్తాడు. దాంతో జాను కంగారు పడి భయంతో ఇంటికి వెళ్లిపోదామని అంటుంది.
వివేక్ వద్దని చెక్ చేయించుకొనే వెళ్దామని అంటాడు. ఇంతలో డాక్టర్ పిలిస్తే జాహ్నవి వెళ్తుంది. మరోవైపు మిత్ర, లక్ష్మీలు కలిసి గుడికి వెళ్తారు. లక్ష్మీ తమ పేరు మీద వివేక్, జానుల పేరు మీద అర్చన చేయిస్తుంది. ఇక డాక్టర్ జానుకి టెస్ట్ చేస్తుంది. జాను చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ 108 ప్రదక్షిణలు చేస్తానని అంటుంది. అన్ని ఎందుకు అంటే మీరు ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండాలని అంటుంది. ఇంట్లో రాజేశ్వరి దేవి టెన్షన్‌తో కంగారుగా గుమ్మం ముందు అటూ ఇటూ తిరుగుతుంది. జయదేవ్ రావడంతో జాను గురించి బెంగగా ఉందని అంటుంది.
మరోవైపు మనీషా దేవయానితో లక్ష్మీకి ప్రశాంతత లేకుండా చేస్తానని అంటుంది. దేవయాని మనీషాతో జానులో లోపం ఉందని తెలిస్తే జానుని ఇంటి నుంచి గెంటేస్తానని అంటుంది. ఈ ఇంట్లో తనకు ఎవరూ ఎదురు తిరగరని అంటుంది. దేవుడినే అడ్డు పెట్టుకొని ప్లాన్ అమలు చేస్తానని రెడీగా ఉండమని మనీషా చెప్తుంది. ఇక జానుకి టెస్ట్‌లు పూర్తయిపోతాయి. రిపోర్ట్ కోసం ఎదురు చూస్తారు. మరోవైపు వివేక్ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. తనకు టెస్ట్‌లు చేస్తానని డాక్టర్ అంటే ఇద్దరికీ టెస్ట్‌లు అయిన తర్వాత లోపం ఎవరిలో ఉన్నా నాకే చెప్పండి నా భార్య తట్టుకోలేదని తల్లి కూడా గొడవ పెడుతుందని అంటాడు. మనీషా అంకుల్ ఇంటికి వస్తారు.
లక్ష్మీ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే దీక్షితులు గారు లక్ష్మీని పిలుస్తారు. నీ కోసమే వచ్చానని అంటారు. లక్ష్మీ దీక్షితులు గారితో మళ్లీ మిత్ర గారికి గండం ఉందా అని అడుగుతుంది. దానికి దీక్షితులు గారు ఈ సారి నీకు నీ చెల్లికి గండం ఉందని మీ భవిష్యత్ మార్చే భయంకరమైనదని అంటారు. ఈ రోజే అది జరగబోతుందని అంటాడు. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. పరిష్కారం ఏం లేదని దీన్ని మీరే ఎదుర్కొవాలని చెప్తారు. రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ వివేక్‌ని మాత్రమే పిలిపిస్తారు. వివేక్ జానుకి ధైర్యం చెప్పి లోపలికి వెళ్తాడు. డాక్టర్ వివేక్‌తో ప్రాబ్లమ్ మీ వైఫ్‌లోనే ఉందని చెప్తాడు. డాక్టర్ ప్రాబ్లమ్ వివరించి 3 నెలలు మందులు వాడాలని చెప్తారు. వివేక్ డాక్టర్‌తో నాలో ప్రాబ్లమ్ ఉన్నట్లు రిపోర్ట్ ఇవ్వండని ఇద్దరం కలిసి మందులు వాడాలని చెప్పాలని డాక్టర్‌కి బతిమాలుతాడు. డాక్టర్ సరే అంటాడు.
మరోవైపు మిత్రకు ఓ ఫోన్ రావడంతో హడావుడిగా పరుగులు తీస్తాడు. పంతులు హారతి ఇస్తున్నా తీసుకోకుండా పరుగులు తీస్తాడు. హారతి కూడా కొండెక్కడంతో పంతులు మిత్ర వాళ్లకి ఏదో ప్రాబ్లమ్ రాబోతుందని అనుకుంటాడు. మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి మనీషా కళ్లు తిరిగి పడిపోయిందని పరుగులు తీస్తాడు. వివేక్ జాను దగ్గరకు వెళ్లి తనకు ప్రాబ్లమ్ ఉందని ఇద్దరం కూడా 3 నెలలు మందులు వాడాలని చెప్పాడు. మిత్ర వాళ్లు ఇంటికి వెళ్తారు. అంకుల్‌ని చూసి మిత్ర మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగితే మనీషాని అమెరికా తీసుకెళ్తానని వచ్చారని అంటాడు. మనీషాకి ఏమైందో అని మిత్ర కంగారు పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!





















