మెగా156 క్రేజీ అప్డేట్ - చిరంజీవి కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ టైం ఫిక్స్
వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ‘బోళాశంకర్’ గట్టి దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ విడులైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ షురూ చేశారు మేకర్స్. సోషియో ఫాంటసీ చిత్రంగా ‘మెగా 156’ తెరకెక్కుతుందని చెప్పడంతో ఆడియెన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ డేట్ వెల్లడించారు. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 15) సాయంత్రం 5 గంటలకు సినిమా పేరును ప్రకటించనున్నట్లు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నా సామి రంగ రివ్యూ: నాగార్జున సినిమా ఎలా ఉందంటే?
కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన సినిమా 'నా సామి రంగ'. సంక్రాంతి బరిలో విడుదల చేయాలని పట్టుబట్టి మరీ మూడు నెలల్లో సినిమా పూర్తి చేశారు. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి విజయాలు అందుకున్న నాగార్జున... 2024 సంక్రాంతికి 'నా సామి రంగ' సినిమాతో విజయం అందుకుంటారా? దర్శకుడిగా పరిచయమైన విజయ్ బిన్నీ ఎలా చేశారు? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రిలీజైన రెండు వారాలకే ఓటీటీకి వచ్చేసిన స్టార్‌ హీరో సినిమా - స్ట్రీమింగ్ ఎక్కడంటే..
'బింబిసార' మూవీ నుంచి నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ దూకుడు పెంచాడు. హిట్‌ ప్లాప్స్‌తో సంబంధంగా లేకుండ వరుస సినిమాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన కథ, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్‌గా 'డెవిల్‌' అనే మూవీతో వచ్చాడు. బ్రిటిష్‌ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌  29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ముంబైలో కీర్తి సురేష్ మూవీ షురూ - తమిళ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌కు
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ల్ హీరోయిన్లుగా ఎదిగిన పలువురు హీరోయిన్లు ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో రాణిస్తున్నారు. రీసెంట్ గా ‘జవాన్’ మూవీతో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇప్పుడు మహానటి బ్యూటీ కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ లోకి వెళుతున్నారు. ఆమె తొలి హిందీ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రెండో రోజు 100 కోట్ల మార్క్‌ దాటేసిన ‘గుంటూరు కారం’ - 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వడం కోసం ‘గుంటూరు కారం’ సినిమా విడుదలయ్యింది. త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 11 ఏళ్ల తర్వాత తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ కాంబినేషన్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండే ఫ్యాన్స్ అంతా ఉత్సాహంతో ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా జనవరి 12న ‘గుంటూరు కారం’ థియేటర్లలోకి వచ్చింది. ప్రీ బుకింగ్స్ విషయంలో, కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తోంది. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.127 కోట్లను కలెక్ట్ చేసింది ఈ గుంటూరోడి సినిమా. అందుకే ‘రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్’ పేరుతో ఈ మూవీ కలెక్షన్స్‌ను రివీల్ చేశారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)