Guntur Kaaram 2 Days Collections: సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వడం కోసం ‘గుంటూరు కారం’ సినిమా విడుదలయ్యింది. త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 11 ఏళ్ల తర్వాత తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ కాంబినేషన్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండే ఫ్యాన్స్ అంతా ఉత్సాహంతో ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా జనవరి 12న ‘గుంటూరు కారం’ థియేటర్లలోకి వచ్చింది. ప్రీ బుకింగ్స్ విషయంలో, కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే ఈ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇక విడుదలయ్యి రెండురోజుల కావడంతో ఆ రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు బయటికొచ్చాయి. మిక్స్డ్ టాక్ వచ్చినా... కలెక్షన్స్ బావున్నాయి.


రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్‌ బస్టర్..
ప్రీ బుకింగ్స్ విషయంలో ‘గుంటూరు కారం’ మూవీ దూసుకుపోయింది. ఇక ప్రీ బుకింగ్స్ కారణంగా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. రెండో రోజు కూడా పండగ వీకెండ్ కావడంతో ‘గుంటూరు కారం’ కలెక్షన్స్‌పై పాజిటివ్ ఎఫెక్టే పడింది. రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.127 కోట్లను కలెక్ట్ చేసింది ఈ గుంటూరోడి సినిమా. అందుకే ‘రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్’ పేరుతో ఈ మూవీ కలెక్షన్స్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇక సినిమా రివ్యూల విషయానికొస్తే.. ఇందులో మహేశ్ బాబు వన్ మ్యాన్ షో అని స్క్రీన్‌పై హీరో కనిపిస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అవుతారని చూసినవారు చెప్తున్నారు. కొందరు ఈ మూవీకి నెగిటివ్ టాక్ ఇచ్చినా.. అవి ప్రస్తుతం కలెక్షన్స్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు.






మళ్లీ అదే జోనర్..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇతర సినిమాలలాగానే ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. ‘గుంటూరు కారం’ సినిమాను కేవలం మహేశ్ బాబు కోసం చూడాలని, సినిమాలో ఇంకా ఏ ఇతర హైలెట్స్ లేవని అంటున్నారు. అలా ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది. దీంతో ‘గుంటూరు కారం’కు పోటీగా విడుదలయిన ‘హనుమాన్’ను చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా ‘గుంటూరు కారం’లాంటి పెద్ద సినిమాతో ‘హనుమాన్’కు పోటీ ఎందుకు అని విమర్శించిన ప్రేక్షకులే... ఇప్పుడు ‘హనుమాన్’ బాగుందంటూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.


డ్యాన్స్‌తో రచ్చ..
‘గుంటూరు కారం’లో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులు ఆడియన్స్‌కు కన్నుల పండుగగా నిలిచాయి. మహేశ్.. తన గత సినిమాల్లో ఎప్పుడూ చేయనంత డ్యాన్స్‌ను ఈ సినిమాలో చేసి చూపించాడు. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు అయితే థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ మూవీలో డ్యాన్స్ కోసం మహేశ్ ఎంత కష్టపడినా.. అది ఫ్యాన్స్‌ను కొంత వరకు మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలిగింది. సినిమా మొత్తం బాగుంటే మహేశ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. ‘గుంటూరు కారం’ కాస్త బోరింగ్‌గా అనిపించడంతో త్రివిక్రమ్‌పై కూడా విమర్శలు మొదలయ్యాయి.


Also Read: నా సామి రంగ రివ్యూ: నాగార్జున సినిమా ఎలా ఉందంటే?