Devil OTT Streaming: 'బింబిసార' మూవీ నుంచి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ దూకుడు పెంచాడు. హిట్ ప్లాప్స్‌తో సంబంధంగా లేకుండ వరుస సినిమాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన కథ, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్‌గా 'డెవిల్' అనే మూవీతో వచ్చాడు. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ పర్పామెన్స్ వావ్ అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెల్స్‌లో అదరగోట్టాడు. కానీ మూవీ మాత్రం ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా యావరేజ్ టాక్‌కు పరితమైన ఈ సినిమా థియేటర్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.
రెండు వారాల్లోనే ఓటీటీకి
అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలోకి వచ్చేసింది. నిన్న డెవిల్ డిజిటల్ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ప్రకటించింది అమెజాన్ ప్రైం. జనవరి 14 అంటే నేటి నుంచి డెవిల్ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్ హీరో సినిమా, బిగ్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి రావడం గమనార్హం. ఇక సైలెంట్‌గా డెవిల్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించి డిజిటల్ ప్రియులను సర్‌ప్రైజ్ చేసింది అమెజాన్ ప్రైం. మరి థియేటర్లో ఈ సినిమా చూడని వారు ఈ సంక్రాంతి పండుగకు ఇంట్లోనే ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంతో నిర్మించారు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు.
'సలార్' మేనియా ముందు నిలవలేకపోయిన 'డెవిల్'
సాధారణంగానే కళ్యాణ్ రామ్ సినిమా అంటే హైప్ ఉంటుంది. అతడి సినిమాల్లో కామెడీతో కొత్త కంటెంట్ ఉంటుంది. అలా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన డెవిల్ ఒపెనింగ్స్ కూడా బాగానే ఇచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి మేకర్స్ హ్యాపీ అయ్యారు. కానీ అదే టైంలో 'సలార్' మూవీ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా క్రేజ్, ప్రభాస్ మేనియా ముందు డెవిల్ నిలవలేకపోయింది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో డెవిల్ సినిమా రూ. 23 కోట్ల వరకు వసూళ్లు చేసినట్టు సమాచారం. ఇక సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఉండటంతో రెండు వారాలకే డెవిల్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది.
Also Read: ఏదైనా అతిగా చేయొద్దు, నన్నేమైనా ఉద్యోగంలో పెట్టుకున్నాడా - పల్లవి ప్రశాంత్‌పై శివాజీ వ్యాఖ్యలు
'డెవిల్ 2' ఎప్పుడంటే..
డెవిల్ మూవీ రిలీజ్ సందర్భంగా దీనికి సీక్వెల్ కూడా ఉందని కళ్యాణ్ రామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూవీ ఫంక్షన్ కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. డెవిల్ 2 కూడా ఉంటుందన్నాడు. 2024లో డెవిల్ 2 షూటింగ్ మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఈ సీక్వెల్ 1940 ఎరా నుంచి 2000 ఎరా కూడా కనిపిస్తుందన్నాడు. ఈరెండు కాలాలు కలిపి చూడబోతున్నామని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. తన 21సినిమాను ఓ డెబ్యూ డైరెక్టర్‌తో కమిట్ అయ్యాడు. NKR21 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే మూవీ డైరెక్టర్‌తో మరిన్ని వివరాలను టీం వెలడించనుందని సమాచారం.