అల్లు అర్జున్‌‌కు కలిసిన కార్తికేయ - ‘బెదురులంక 2012’ సక్సెస్‌పై బన్నీ అభినందనలు
‘పుష్ప’ సినిమాలో నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో కార్తికేయ.. అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. బన్నీ కూడా కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ సక్సెస్ నేపథ్యంలో కార్తికేయకు అభినందనలు తెలిపాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రామ్‌తో ఇది మూడో సినిమా, అలా సెట్ అయ్యింది: శ్రీలీల
శ్రీలీల అప్‌కమింగ్ మూవీ ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం జరిగింది. ఇందులో శ్రీలీల తన క్యూట్ స్పీచ్‌తో ఫిదా చేసింది. ‘స్కంద’ ప్రీ రిలీజ్ కోసం బాలకృష్ణ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ఈ ఈవెంట్‌లో హీరో రామ్, బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇలా అందరి స్పీచ్‌లు ఆడియన్స్‌కు హై ఎనర్జీని ఇచ్చాయి. ఈ సందర్శంగా తమన్‌తో కలిసి శ్రీలీల స్టేజ్‌పై పాట కూడా పాడింది. ఈ భామ డ్యాన్స్ ఇరగదీస్తుంది అని తెలిసినా.. పాటలు కూడా బాగా పాడుతుంది అంటూ ఆడియన్స్ మరోసారి తన మల్టీ టాలెంట్స్‌కు ఫిదా అయిపోయారు. పాటతో మాత్రమే కాదు.. తన స్పీచ్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అక్కడ ‘జైలర్‌’ సరికొత్త రికార్డ్ - 72 ఏళ్ళ వయసులో రజినీ ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జైలర్‌'. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రైలర్, సాంగ్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఫలితంగా 72 ఏళ్ళ వయసులో రజనీ తనశైలి డైలాగులు, స్టైల్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా మరికొన్ని రికార్డును బద్దలు కొట్టారు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జైలర్‌’ సినిమా.. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 580 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందులో తమిళ వెర్షనే 450 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసి, కోలీవుడ్ సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించిందని తెలుస్తోంది. అన్ని భాషల్లో వసూళ్లను పరిగణలోకి తీసుకుంటే మాత్రం 2.0 మూవీ (₹615–₹800 కోట్లు) ఇండస్ట్రీ హిట్‌గా మిగిలిపోతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా - బాధ్యత పెరిగింది తమ్ముడూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులలో హీరో నితిన్ కూడా ఒకరు. ఆ విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. 'గుండెజారి గల్లంతయ్యిందే'లో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా 'తొలిప్రేమ'లో 'ఏమైందో ఈ వేళ' పాటను రీమిక్స్ చేశారు. ఇప్పుడు కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. నితిన్ కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించనున్న చిత్రమిది. ఆ సంస్థలో 56వ చిత్రమిది. దీనికి 'తమ్ముడు' టైటిల్ ఖరారు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దేవరకొండ బ్రదర్స్ ‘అది నా పిల్ల’ డైలాగ్‌పై మీమ్ - ఫన్నీగా స్పందించిన విజయ్
ఒకప్పుడు మీమ్స్‌ను మన సెలబ్రిటీలను పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అయితే, ఈ మధ్య ఈ మీమ్స్ మూవీస్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. రివ్యూల తరహాలోనే మీమ్స్ కూడా సినిమాలో ప్లస్ మైనస్‌లను చెప్పేస్తున్నాయి. అంతేకాదు.. ఆ సినిమాల్లోని కొన్ని సీన్లతో మీమర్స్ చేసే ఫన్నీ పోస్టులు కూడా నవ్విస్తున్నాయి. తాజాగా దేవరకొండ బ్రదర్స్ మీద చేసిన మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అది విజయ్ దేవరకొండ కంటపడింది. దానిని విజయ్ మళ్లీ రీపోస్ట్ కూడా రీపోస్ట్ చేస్తూ ఫన్నీగా స్పందించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)