ఒకప్పుడు మీమ్స్‌ను మన సెలబ్రిటీలను పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అయితే, ఈ మధ్య ఈ మీమ్స్ మూవీస్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. రివ్యూల తరహాలోనే మీమ్స్ కూడా సినిమాలో ప్లస్ మైనస్‌లను చెప్పేస్తున్నాయి. అంతేకాదు.. ఆ సినిమాల్లోని కొన్ని సీన్లతో మీమర్స్ చేసే ఫన్నీ పోస్టులు కూడా నవ్విస్తున్నాయి. తాజాగా దేవరకొండ బ్రదర్స్ మీద చేసిన మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అది విజయ్ దేవరకొండ కంటపడింది. దానిని విజయ్ మళ్లీ రీపోస్ట్ కూడా రీపోస్ట్ చేస్తూ ఫన్నీగా స్పందించాడు.


‘ఖుషి’లో ఒకలాగా.. ‘బేబి’లో మరొకలాగా..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఏదంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ క్రెడిట్ అంతా ‘అర్జున్ రెడ్డి’కే వెళ్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా విడుదలయ్యి చాలా ఏళ్లు అయినా కూడా ఇంకా అందులోని ప్రతీ డైలాగ్, పాట, మూవీలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్.. ఇంకా చాలామంది యూత్‌కు గుర్తుండిపోయింది అంటే దానికి చాలావరకు క్రిడెట్ హీరోకే దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘అది నా పిల్ల’ అనే డైలాగ్.. అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘ఖుషీ’ మూవీలో కూడా ‘అది నా పిల్ల’ డైలాగ్‌ ఉంది. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబి’ సినిమాలో కూడా ఇదే డైలాగ్‌ను రిపీట్ చేశారు. దీంతో ఈ డైలాగును ఎన్ని విధాలుగా చెప్పవచ్చు అనేదానిపై ఫన్నీగా ఒకరు మీమ్‌ను క్రియేట్ చేశారు.


‘అది నా పిల్ల’ అనేది ఎమోషన్..
‘అది నా పిల్ల’ అనే డైలాగ్ విపరీతంగా ఫేమస్ అవ్వడంతో విజయ్ దేవరకొండ తరువాతి చిత్రం ‘ఖుషి’లో కూడా ఆ డైలాగ్‌‌ను ఉపయోగించారు. అంతే కాకుండా ఈ మూవీలో ఆ డైలాగ్ ఉన్నట్టు ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. ఓవైపు ‘ఖుషి’లో విజయ్ చెప్పిన డైలాగ్.. ‘బేబి’లో ఆనంద్ చెప్పిన డైలాగ్‌ను పక్కపక్కన పెట్టి ఫన్నీ మీమ్ క్రియేట్ చేశారు మీమర్స్. దానికి ‘సరిపోయారు ఇద్దరు’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. దానిని ‘అది నా పిల్ల అనేది ఒక ఎమోషన్’ అని క్యాప్షన్ పెడుతూ.. ఈ మీమ్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. దీనికి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.






‘ఖుషి’ ప్రమోషన్స్‌లో బిజీ.. 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. తను హీరోగా నటించిన ‘ఖుషి’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇంకా ఈ మూవీ రిలీజ్‌కు దాదాపుగా 10 రోజులే సమయం ఉండడంతో అన్ని సిటీలు చుట్టేస్తూ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు విజయ్. శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’.. లవ్ స్టోరే అయినా ఇందులో నటించిన సమంత, విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని మూవీని తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఖుషి’ ట్రైలర్ చూస్తుంటే ఇది చాలామంది యంగ్ కపుల్స్‌కు కనెక్ట్ అయ్యే కథలాగా అనిపిస్తుందని ఆడియన్స్ అప్పుడే పాజిటివ్ రివ్యూలు ఇచ్చేశారు. అంతే కాకుండా ప్రీ బుకింగ్స్ విషయంలో కూడా ‘ఖుషి’ వండర్స్ సృష్టించే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. 


Also Read: మెగా హీరోను వెనక్కి నెట్టేసిన కార్తికేయ, వీకెండ్ వార్‌లో వరుణ్ తేజ్‌పై పైచేయి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial