అన్వేషించండి
Advertisement
Krishnavamsi: ప్రకాష్ రాజ్ తో కృష్ణవంశీ గొడవ - సెటిల్ అయినట్లే!
'రంగమార్తాండ' సినిమా షూటింగ్ పూర్తయినా.. ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటివరకు డబ్బింగ్ పూర్తి చేయలేదు.
ప్రముఖ దర్శకుడు కృష్మవంశీ(Krishnavamsi) 'రంగమార్తాండ'(Rangamarthanda) అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది.
చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషించారు. సినిమా షూటింగ్ పూర్తయినా.. ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటివరకు డబ్బింగ్ పూర్తి చేయలేదు. ఆ కారణంగానే రిలీజ్ ఆలస్యమవుతుందని టాక్.
ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ ఇదివరకు చాలా సార్లు గొడవపడ్డారు. కృష్ణవంశీతో పని చేయనని ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ తో సినిమా తీయనని కృష్ణవంశీ అనుకున్నారు. కానీ 'గోవిందుడు అందరివాడేలే' సినిమాతో ఆ గ్యాప్ పూడిపోయింది. మళ్లీ కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 'రంగమార్తాండ' సినిమాలో లీడ్ రోల్ కోసం ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అయితే ఈ సినిమా మేకింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందట.
తన రెమ్యునరేషన్ ఇవ్వనందుకు ప్రకాష్ రాజ్ ఇంతవరకు డబ్బింగ్ చెప్పలేదు. ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేయడానికి ముందుకొచ్చారు. రెండు రోజుల్లో ఈ డబ్బింగ్ వర్క్ పూర్తవుతుంది. ఆ తరువాత విడుదల చేయడమే తరువాయి. అయితే ప్రకాష్ రాజ్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చారా..? లేదా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకోవడంతో కృష్ణవంశీకి ఒక సమస్య తీరిపోయింది. దీపావళికి ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకుడు కృష్ణవంశీ. ఇక ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
కృష్ణవంశీ ఓటీటీ ప్రాజెక్ట్:
కృష్ణవంశీ త్వరలోనే ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల రూ.300 కోట్ల వరకు ఉంటుంది. ఇదొక బ్లాస్ట్ లాంటి ప్రాజెక్ట్ అని.. త్వరలోనే వివరాలు చెబుతానని అన్నారట. కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ని నమ్మి మూడొందల కోట్ల బడ్జెట్ పెట్టడమంటే మాములు విషయం కాదు. కాకపోతే ఓటీటీలతో ఏదైనా సాధ్యమనే చెప్పాలి. అక్కడ బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవు. ప్రాజెక్ట్ పై నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టొచ్చు. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు మూడొందల కోట్లు పెద్ద మేటర్ కూడా కాదు.

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion