Sobhita Dhulipala: శోభితా డ్రెస్ చాలా సింపుల్‌గా ఉంది కదూ - ధర తెలిస్తే గుండె ఆగుద్ది జాగ్రత్త!
తాజాగా శోభితా దూళిపాళ నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం స్టైలిష్ లుక్స్‌తో గ్లామర్ డోస్ పెంచేసింది ఈ భామ.
శోభితా దూళిపాళ.. సినిమాలతో పర్ఫార్మెన్స్ కంటే హీరో అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్‌తోనే టాలీవుడ్‌లో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. తెలుగులో అప్పుడప్పుడు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా.. బాలీవుడ్‌లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం స్టైలిష్ లుక్స్‌తో గ్లామర్ డోస్ పెంచేసింది ఈ భామ. ఒక సింపుల్ ఫ్రాక్‌లో తను అప్లోడ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్రాక్ చూడడానికి సింపుల్‌గా ఉన్నా రేటు మాత్రం అదిరిపోయింది.
ఈ డ్రెస్ బాగా కాస్ట్‌లీ గురూ..!
ఫ్యాషన్ విషయంలో శోభితా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. అసలు తనకు ఎలాంటి డ్రెస్సులు సూట్ అవుతాయి, ఎలాంటి కలర్ సెట్ అవుతుంది అనే విషయంలో చాలా క్లారిటీతో ఉంటుంది. అందుకే తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ఫోటోలకు వెంటవెంటనే వేలల్లో లైక్స్ వచ్చి పడతాయి. ప్రస్తుతం ఈ భామ.. తను నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో సీరియస్‌గా పాల్గొంటోంది. అందులో భాగంగానే ఒక కాటన్ మ్యాక్సీ డ్రెస్‌ను ధరించి ఫోటోలకు పోజ్‌లు ఇచ్చింది. చూడడానికి ఈ డ్రెస్ చాలా సింపుల్‌గా ఉంది. గ్రాండ్‌గా కూడా ఏమీ అనిపించడం లేదు. కానీ దీని ధర మాత్రం ఏకంగా రూ.22,990 అని సమాచారం. తను వేసుకున్న ఈ సింపుల్, కాస్ట్‌లీ డ్రెస్ పర్ఫెక్ట్ సమ్మర్ వేర్ అని ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అంతే కాకుండా ఈ డ్రెస్‌కు తగినట్టుగా మల్టీ కలర్ బ్యాంగిల్స్, కమ్మలు పెట్టుకొని మరీ స్టైలిష్‌గా కనిపిస్తోంది శోభితా.
View this post on Instagram
శోభితా ధూళిపాళ వేసుకున్న ఈ మ్యాక్సీ డ్రెస్.. అట్సు అనే బ్రాండ్‌కి చెందినదిగా తెలుస్తోంది. భావ్నా శర్మ.. దీనికి స్టైలింగ్ చేసింది. ఈ డ్రెస్ చూసిన చాలామంది అమ్మాయిలు.. ఇలాంటిది తమ వార్డ్‌రోబ్‌లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. శోభితా లీడ్ రోల్ చేసిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ సిరీస్ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ పార్ట్.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యి సక్సెస్ సాధించింది. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెండో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయిదేళ్ల తర్వాత..
జోయా అఖ్తర్, రీమా కగ్తి కలిసి తెరకెక్కించిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ విడుదలయ్యి కొన్ని గంటలే అయినా ఇప్పటికే చూసిన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఫస్ట్ పార్ట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా, అవే ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ రెండో భాగాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు అంటూ మేకర్స్‌కు ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఇందులో ఎంతమంది నటీనటులు ఉన్నా శోభితా ధూళిపాళ మాత్రం షోకు హైలెట్ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అయిదేళ్ల క్రితం విడుదలయినా కూడా ఫస్ట్ పార్ట్ గురించి ఇంకా ప్రతీ వివరాన్ని గుర్తుపెట్టుకున్న ‘మేడ్ ఇన్ హెవెన్’ ఫ్యాన్స్.. సెకండ్ పార్ట్‌ను కూడా పర్ఫెక్ట్‌గా ముగించారని అంటున్నారు.
Also Read: కష్టాల్లో ‘ఏజెంట్’ నిర్మాత అనిల్ సుంకర, కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial