Premalu OTT: ఓటీటీలోకి ‘ప్రేమలు’ మూవీ? - ఇలా షాకిచ్చారేంటి సామి?
Premalu OTT Release: మలయాళం, తెలుగు, తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘ప్రేమలు’.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ మూవీని ఓటీటీలో మళ్లీ చూడడానికి ప్లాన్ చేస్తున్నారు.
Premalu OTT Release Date: గిరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకే మలయాళం సినిమా అయినా.. ఇది తెలుగు, తమిళంలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. అంతే కాకుండా ప్రతీ భాషలో డబ్బింగ్ చిత్రాల పేరు మీద ఉన్న రికార్డులను తిరగరాసింది. ఈ ఒక్క సినిమాతో నస్లీన్, మమిత బైజు తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయారు. ఇక థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో థియేటర్లలో చూసి ఈ మూవీని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు కూడా మళ్లీ ఓటీటీలో చూడడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఏ ఓటీటీలో?
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 29 నుంచి ‘ప్రేమలు’ స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం జరిగింది. దీంతో ఎంతో ఆసక్తిగా టీవీ ఆన్ చేసిన ఓటీటీ సబ్‌స్క్రైబర్లకు నిరాశ తప్పలేదు. మేకర్స్ కూడా దీనిపై అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరీ 9న ముందుగా మలయాళ భాషలో మాత్రమే థియేటర్లలో విడుదలయ్యింది ఈ సినిమా. అయితే మలయాళంలో విడుదలయినా కూడా సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేయవచ్చులే అని ఆలోచనతో చాలామంది తెలుగు ప్రేక్షకులను ఈ మూవీని థియేటర్లలో చూడడానికి వెళ్లారు. వారి దగ్గర నుంచి సూపర్ హిట్ మౌత్ టాక్ లభించడంతో.. అలా ‘ప్రేమలు’కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తే వర్కవుట్ అవుతుంది అనుకున్న నిర్మాతలు.. యూత్‌కు కనెక్ట్ అయ్యే తెలుగు డైలాగులు రాయించి మార్చి 8న ‘ప్రేమలు’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేశారు.
సింపుల్ ప్రేమకథ..
తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తుందని.. ‘ప్రేమలు’ను తమిళంలో డబ్ చేయించి మార్చి 15న థియేటర్లలో విడుదల చేశారు. మలయాళం సినిమానే అయినా.. ఇటు తెలుగులో, అటు తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. 2024లో విడుదలయిన మలయాళ చిత్రాల్లో టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ‘ప్రేమలు’ ఒక సింపుల్ ప్రేమకథ. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథ. అంతకు మించి ఇందులో ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు ఏమీ లేవు. కానీ ఈ సింపుల్ లవ్ స్టోరీనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఆ రేంజ్‌లోనే దూసుకుపోయింది ‘ప్రేమలు’.
ఓ రేంజ్ కలెక్షన్స్..
‘ప్రేమలు’లో నస్లీన్, మమిత బైజుతో పాటు సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీమ్, మాథ్యూ థామస్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా విష్ణు విజయ్ అందించిన సంగీతం.. సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఫాహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లోనే దాదాపుగా ‘ప్రేమలు’ షూటింగ్ జరగడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. కేవలం తెలుగులో మాత్రమే రూ.50 కోట్లు కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రంగా రికార్డ్ దక్కించుకుంది ‘ప్రేమలు’. కొన్నేళ్లలో ఈ రేంజ్‌లో ఏ మలయాళ సినిమాకు ఇంత ఆదరణ లభించలేదని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు.
Also Read: బ్యాక్ టూ బ్యాక్ డజన్ ఫ్లాప్స్ - హీరో నితిన్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?