Horror Movies On OTT: ఆ ఊరికి వెళ్తే మళ్లీ తిరిగిరాలేరు, ఇదెక్కడి సాంప్రదాయం - మోస్ట్ డిస్టర్బింగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ చూశారా?
Movie Suggestions: ఆ ఫ్రెండ్స్ అంతా సరదా కోసం ఒక ఊరికి వెళ్తారు. అక్కడ జరిగే పండగలో పాల్గొంటారు. అదే వారు చేసిన తప్పు. దాని వల్ల మళ్లీ వారు తిరిగి రాలేరు.
Best Horror Movies On OTT: హాలీవుడ్‌లో వింత వింత కథలతో, డిస్టర్బింగ్ సీన్స్‌తో హారర్ చిత్రాలు తెరకెక్కడం కామన్. అలాంటి డిస్టర్బింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒకటి ‘మిడ్సోమ్మర్’ (Midsommar). ఇంగ్లీష్‌లో మోస్ట్ డిస్టర్బింగ్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న చిత్రాల్లో ‘మిడ్సోమ్మర్’ కూడా ఉంటుంది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు.. తర్వాత ఏం జరుగుతుంది అని ఆసక్తి క్రియేట్ చేసే థ్రిల్లింగ్ కథాంశం కూడా ఉంది.
కథ..
‘మిడ్సోమ్మర్’ కథ విషయానికొస్తే.. డ్యానీ (ఫ్లోరెన్స్ ప్యూఘ్)కి క్రిస్టియన్ (జాక్ రేనోర్) అనే బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు. క్రిస్టియన్ ఫ్రెండ్స్‌కు డ్యానీ నచ్చదు. డ్యానీ చెల్లెలిగా ఒక మానసిక వ్యాధి ఉంటుంది. దాంతో ఒకరోజు తన తల్లిదండ్రులను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో డ్యానీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. బాధలో ఉన్న డ్యానీని తీసుకొచ్చి తన ఫ్లాట్‌లోనే ఉంచుతాడు క్రిస్టియన్. అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా ఒక ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. ఆ విషయం డ్యానీకి తెలిసి తాను కూడా వస్తానని పట్టుబడుతుంది. అప్పుడే క్రిస్టియన్ ఫ్రెండ్ పేల్లే (విల్హెమ్ బ్లామ్గ్రెన్).. ఈ ట్రిప్ ఎక్కడికో కాదు.. తన ఊరికే అని, అక్కడ మిడ్‌సోమ్మర్ అని 90 ఏళ్లకు ఒకసారి ఫెస్టివల్ జరుగుతుందని డ్యానీకి వివరిస్తాడు. అలా క్రిస్టియన్, డ్యానీ, వాళ్ల ఫ్రెండ్స్ కలిసి పేల్లే ఊరికి బయల్దేరుతారు.
అందరూ ఊరిలోకి ఎంటర్ అవ్వగానే వారికి వేరే గ్యాంగ్ కనిపిస్తుంది. వారు క్రిస్టియన్ అండ్ ఫ్రెండ్స్‌కు తినడానికి ఇచ్చిన ఫుడ్‌లో డ్రగ్స్ ఉంటాయి. దీంతో అందరూ ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. డ్రగ్స్ వల్ల డ్యానీకి తన చనిపోయిన ఫ్యామిలీ కనిపించినట్టుగా ఊహించుకుంటుంది. తను లేచిన తర్వాత అందరూ కలిసి ఊరిలోకి వెళ్తారు. అప్పటికే ఊరిలో ప్రజలంతా మిడ్‌సోమ్మర్ కోసం ఫ్రాక్స్ వేసుకొని రెడీగా ఉంటారు. ఆ వాతావరణమంతా డ్యానీకి చాలా నచ్చుతుంది. ఈ ఫెస్టివల్ చూడడానికి వచ్చిన గెస్ట్స్ అంతా ఒక పెద్ద బంగ్లాలో ఉంటారు. ఊరికి వచ్చిన తర్వాత డ్యానీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటాడు పేల్లే. మిడ్‌సోమ్మర్ ఫెస్టివల్‌లోని మొదటి రోజు ఒక ముసలి జంట.. ఒక కొండపైకి వెళ్లి దూకి చనిపోతారు. ఇదంతా ఊరి ప్రజల కళ్ల ముందే జరుగుతుంది.
ముసలి జంట చనిపోవడం చూసిన డ్యానీ చాలా భయపడుతుంది. కానీ అక్కడ ఉన్నవారంతా ఇది తమ సాంప్రదాయంలో భాగమని డ్యానీకి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తారు. మిడ్‌సోమ్మర్ అనేది క్రిస్టియన్‌తో పాటు తన ఫ్రెండ్ జోష్ (విలియమ్ జాక్సన్)కు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి దీనిపై థీసిస్ చేయాలని అనుకుంటారు. డ్యానీకి మాత్రం ఇదంతా అస్సలు నచ్చదు. అక్కడి నుండి వెళ్లిపోదామని క్రిస్టియన్‌ను బలవంతపెడుతుంది. కానీ తను పట్టించుకోడు. తమతో పాటు మిడ్‌సోమ్మర్ చూడడానికి వచ్చిన వేరే గ్యాంగ్ కనిపించకుండా పోతుందని డ్యానీ గమనిస్తుంది. అక్కడ ఏదో తప్పు జరుగుతుందని తనకు అర్థమవుతుంది. మెల్లగా తన ఫ్రెండ్స్ కూడా కనిపించకుండా పోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? డ్యానీ అక్కడ నుండి బ్రతికి బయటపడగలదా? అన్నది తెరపై చూడాల్సిన కథ.
న్యూడిటీ కూడా..
‘మిడ్సోమ్మర్’ కథ వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఈ సినిమాలోకి ఇంపాక్ట్ తెలియదు. చూస్తున్నప్పుడు మాత్రమే ఈ మూవీ ఎంత డిస్టర్బింగ్ అని అర్థమవుతుంది. అసలు ఆ ఊరికి వచ్చిన గెస్ట్స్ ఎలా చనిపోతుంటారు అని చాలా భయంకరంగా చూపించాడు దర్శకుడు ఆరీ ఏస్టర్. చాలా పాత్రలతో మూవీ మొదలయినా.. ఇది పూర్తయ్యే సమయానికి మాత్రం కొన్ని క్యారెక్టర్లే ప్రేక్షకుల్లో రెజిస్టర్ అయిపోతాయి. డిస్టర్బింగ్ సీన్స్‌తో పాటు ఇందులో న్యూడిటీ కూడా ఉంటుంది. అందుకే ఇది చిన్నపిల్లలు చూసే సినిమా కాదు. ఒక డిఫరెంట్ హారర్‌ను ట్రై చేయాలంటే ‘యాపిల్ టీవీ ప్లస్’లో ఉన్న ‘మిడ్సోమ్మర్’ను చూసేయండి.
Also Read: రోడ్డుపై తెగిపడిన అమ్మాయి తల, అక్కడి నుంచే అసలు కథ మొదలు - ప్రపంచంలోనే అత్యంత భయానక మూవీ ఇది