![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Kalki Movie OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన ‘కల్కి’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Kalki Movie OTT: మలయాళం సినిమాలకు తెలుగులో క్రేజ్ పెరుగుతుండడంతో చాలా ఏళ్ల క్రితం విడుదలయిన మలయాళ చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. ఆ లిస్ట్‌లోకి ‘కల్కి’ చేరనుంది.
![Kalki Movie OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన ‘కల్కి’ - ఎప్పుడు, ఎక్కడంటే? ETV Win announces digital streaming OTT release date of Tovino Thomas Kalki Telugu dubbing version Kalki Movie OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన ‘కల్కి’ - ఎప్పుడు, ఎక్కడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/8787ead27219f336ee683a69d81de2bf1717566642197802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalki Movie OTT Release Date: కేవలం తెలుగు సినిమాల కోసం ప్రారంభమయిన ఓటీటీ యాప్స్‌లో ఇప్పుడు తమిళ, మలయాళ డబ్బింగ్ చిత్రాలు హవా చాటుతున్నాయి. రెండు, మూడేళ్ల క్రితం విడుదలయిన ఇతర భాషా చిత్రాలను కూడా డబ్ చేసి తెలుగులోకి తీసుకొస్తున్నాయి ఈ యాప్స్. అందులో ఈటీవీ విన్ కూడా ఒకటి. ఇప్పటికే ఈ ఓటీటీలో ఎన్నో డబ్బింగ్ సినిమాలు సందడి చేస్తుండగా అందులో మరో మూవీ యాడ్ అవ్వనుంది. 2019లో విడుదలయిన ‘కల్కి’ అనే మలయాళం మూవీ... ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి ఈటీవీ విన్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఈటీవీ విన్ ప్రకటించింది.
టోవినో థామస్ తెలుగు ఫ్యాన్స్ హ్యాపీ...
టోవినో థామస్ హీరోగా ప్రవీణ్ ప్రభరమ్ తెరకెక్కించిన చిత్రమే ‘కల్కి’. ఇందులో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా... 2019లో విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా.. తెలుగులోకి రావడానికి సిద్ధమయ్యింది. ‘కల్కి’ తెలుగు డబ్బింగ్ వర్షన్.. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. జూన్ 6 నుండి ‘కల్కి’ స్ట్రీమ్ అవ్వనుందని ఈటీవీ విన్ ప్రకటించింది. దీంతో టోవినో తెలుగు ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.
View this post on Instagram
పెరుగుతున్న క్రేజ్..
ఈ మధ్య మలయాళ సినిమాలకు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటున్నారు. ముఖ్యంగా టోవినో థామస్ లాంటి యంగ్ హీరోలకు ఇక్కడ కూడా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే వారు నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఈ క్రేజ్‌నే క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఎప్పుడో విడుదలయిన సినిమాలను కూడా తెలుగులో డబ్ చేస్తున్నాయి. అలాంటి డబ్బింగ్ చిత్రాలు విడుదలయిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ కూడా సంపాదిస్తున్నాయి. ఇప్పుడు ‘కల్కి’ కూడా అదే కేటగిరిలో చేరుతుందని ఈటీవీ విన్ నమ్ముతోంది.
పోలీస్ పాత్రలో..
ప్రవీణ్ ప్రభరమ్ దర్శకత్వం వహించిన ‘కల్కి’లో టోవినో థామస్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీలో టోవినో, సంయుక్త జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా మలయాళంలో సంయుక్తకు మరికొన్ని ఛాన్సులు దక్కేలా చేసింది ఈ మూవీ. పోలీస్ పాత్రలో టోవినో పాత్ర చాలా బాగుందని ప్రేక్షకులు ప్రశంసించారు. ప్రస్తుతం ‘కల్కి’ మలయాళం వర్షన్.. జీ5లో అందుబాటులో ఉండగా.. దీనిని తెలుగులో చూడాలి అనుకునేవారు జూన్ 6 నుండి ఈటీవీ విన్‌లో కూడా చూడవచ్చు. ఇంకా మరెన్నో మలయాళ సినిమాల డబ్బింగ్ వర్షన్స్ కూడా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: 'కల్కి'ని ఇప్పుడు ఏపీలో ఆపేది ఎవడ్రా - కూటమి రాకతో నిర్మాత ఫుల్ హ్యాపీ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)