By: ABP Desam | Updated at : 08 Nov 2021 06:42 PM (IST)
'కురుప్'లో దుల్కర్ సల్మాన్, 'రాజా విక్రమార్క'లో కార్తికేయ, 'పుష్పక విమానం'లో శాన్వి మేఘన, ఆనంద్ దేవరకొండ
దసరా ముగిసింది. దీపావళి ముగిసింది. థియేటర్ల దగ్గర సినిమాల జాతరకు మాత్రం ముగింపు లేదు. ప్రతి వారం మినిమమ్ మూడు నాలుగు స్ట్రయిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా. మరో రెండు అనువాద సినిమాలు ఉంటున్నాయి. ఈ శుక్రవారం కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. కార్తికేయ గుమ్మకొండ, ఆనంద్ దేవరకొండ, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, కన్నడ కథానాయకుడు సుదీప్ తమ సినిమాలతో థియేటర్లలోకి వస్తున్నారు. వీరికి తోడు సీనియర్ హీరో శ్రీకాంత్ 'తెలంగాణ దేవుడు'తో వస్తున్నారు. మరో మూడు చిన్న సినిమాలు ఉన్నాయి.
రాజా వారు వేటకొస్తే...
ఎన్ఐఏ ఏజెంట్‌గా కార్తికేయ గుమ్మకొండ నటించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఆయన వేట ఎలా ఉంటుందనేది తెరపై చూడాలి. వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన చిత్రమిది. ఇందులో సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా హీరోయిన్. ఆమెది హోమ్ మినిస్టర్ డాటర్ రోల్. ఎన్ఐఏ ఏజెంట్ ఆపరేషన్, హోమ్ మినిస్టర్ కుమార్తెతో ప్రేమాయణం... ప్రచార చిత్రాలు చూస్తే, యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి బాగా తీసినట్టు ఉన్నారు. కార్తికేయ కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ ను అట్ట్రాక్ చేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా నవంబర్ 12న విడుదలవుతోంది.
పెళ్లైన వారానికి ఆవిడ వెళ్లిపోతే?
నవంబర్ 12న విడుదలవుతున్న మరో సినిమా 'పుష్పక విమానం'. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. పెళ్లైన వారం తర్వాత భార్యాభర్తలు సిటీకి వస్తారు. అప్పుడు ఆవిడ వేరేవాళ్లతో వెళ్లిపోతే... హీరో ఎన్ని కష్టాలు పడ్డాడనేది కథ. ప్రచార చిత్రాలు చూస్తే వినోదాత్మకంగా తెరకెక్కించినట్టు దామోదర దర్శకత్వంలో గోవర్ధన్ దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. గీత్ షైనీ, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించారు.
కురుప్... క్రిమినల్‌గా ఎందుకు మారాడు?
కేరళకు చెందిన సుకుమార్ కురుప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మలయాళ సినిమా 'కురుప్'. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. నిర్మాత కూడా ఆయనే. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు. గోపికృష్ణన్ అనే వ్యక్తి మోస్ట్ వాటెండ్ క్రిమినల్ 'కురుప్'గా ఎందుకు మారాడు? అనేది ఆసక్తికరం. తెలుగులో 'మహానటి', 'కనులు కనులు దోచాయంటే' సినిమాలతో దుల్కర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అంతకు ముందు 'ఓకే బంగారం' కూడా అతడిని ప్రేక్షకులకు కొంత దగ్గర చేసింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదీ నాబంబర్ 12న విడుదల అవుతోంది.
యాక్షన్ కథానాయకుడు 'కోటికొక్కడు'
కన్నడ కథానాయకుడు సుదీప్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'కోటికొక్కడు'. ట్రైలర్ చూస్తే పక్కా కమర్షియల్ సినిమా అని అర్థమవుతోంది. తెలుగు ప్రేక్షకులకు సుదీప్ పరిచయం కనుక సినిమా విడుదల చేస్తున్నారు. ఇందులో 'ప్రేమమ్' ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్. శ్రద్దా దాస్ ఓ పాత్ర చేశారు.
కేసీఆర్ బయోపిక్... 'తెలంగాణ దేవుడు'
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏం చేశారనే కథతో రూపొందిన సినిమా 'తెలంగాణ దేవుడు'. ఉద్యమకారుడిగా కేసీఆర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. హరీశ్ వడత్యా దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ నిర్మించారు. కేసీఆర్ బయోపిక్ కనుక... సినిమాలో ఏం చెప్పారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాతో పాటు 'ట్రిప్', 'కపట నాటక సూత్రధారి', 'అతడెవరు?' సినిమాలు నవంబర్ 12న విడుదలవుతున్నాయి. ఈ వారం థియేటర్లలోకి ఎనిమిది చిత్రాలు వస్తున్నప్పటికీ... ఎవరి మధ్య పోటీ లేదని చెప్పాలి. ఏ సినిమా జానర్ అదే కనుక... పోటీ లేదని చెప్పాలి.
Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున
Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్
Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!
Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>